Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాచర్ల కేసులో ట్విస్ట్: గూగుల్ మ్యాప్స్ సాయంతో వచ్చి అఘాయిత్యం!

మాచర్ల కేసులో ట్విస్ట్: గూగుల్ మ్యాప్స్ సాయంతో వచ్చి అఘాయిత్యం!

వార్త 2 months ago

Macherla Crime: పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అమానుష ఘటన సుఖాంతమైంది. సోషల్ మీడియా పరిచయమే శాపంగా మారిన ఈ కేసులో పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

పరిచయస్తుడే కావడంతో బాధితురాలు మొదట నిజం చెప్పడానికి సంకోచించినా, సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిజాన్ని వెలికితీశారు.

Read Also: IT Company : మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. టీమ్ లీడర్‌ అరెస్ట్

సోషల్ మీడియా పరిచయం.. చివరకు ఘాతుకం: ప్రధానాంశాలు

ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సేకరించిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి.నిందితుడు రాజుపాలెం మండలానికి చెందిన నామాల శ్రీనివాస్. బాధితురాలితో ఇతడికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరూ ఛాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 2న ఆమె ఆహ్వానం మేరకు గూగుల్ మ్యాప్ లొకేషన్ సాయంతో ఆమె ఇంటికి చేరుకున్నాడు.

 Macherla govt employee rape case

శ్రీనివాస్ ఇంటికి రాగానే నీళ్లు అడగగా, ఆమె లోపలికి వెళ్లిన తరుణంలో ఆమెపై దాడి చేశాడు. కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు.బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టి, నోరు మూసివేసి, చేతులు, కాళ్లు చున్నీతో కట్టేసి అక్కడి నుండి పారిపోయాడు.బాధితురాలు తన స్నేహితులకు సమాచారం అందించగా, వారు స్థానికుల సాయంతో ఆమెను రక్షించి 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

Macherla Crime Update: పోలీసుల దర్యాప్తు, అరెస్ట్

నిందితుడు తెలిసిన వాడే కావడంతో బాధితురాలు మొదట నిజం చెప్పడానికి భయపడింది. అయితే పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజ్, సోషల్ మీడియా ఛాటింగ్, ఫోన్ డేటాను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు.ఈ నెల 8న మాచర్ల రైల్వే స్టేషన్ వద్ద శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో గురజాల సబ్‌జైలుకు తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు రిలీఫ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha