Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లార్డ్ శివ పిలుస్తున్నాడంటూ లేఖ రాసి.. ఇంటి నుంచి వెళ్ళిపోయిన యువతి! అసలేమైంది?

లార్డ్ శివ పిలుస్తున్నాడంటూ లేఖ రాసి.. ఇంటి నుంచి వెళ్ళిపోయిన యువతి! అసలేమైంది?

వార్త 2 months ago

Hyderabad Crime: హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వింతైన, ఆందోళనకరమైన మిస్సింగ్ కేసు వెలుగుచూసింది. స్థానికంగా నివాసం ఉండే 19 ఏళ్ల యువతి, "తాను డిప్రెషన్‌లో ఉన్నానని, శివయ్య తనను పిలుస్తున్నాడని..

అందుకే ఆయన దగ్గరికే వెళ్లిపోతున్నానని" ఒక లేఖ రాసి పెట్టి ఇంటి నుండి అదృశ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also:Narasaraopet Lodge Suicide Case: ఎయిమ్స్ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి!

Hyderabad Crime: లేఖలో ఏముంది? కలవరపడుతున్న కుటుంబ సభ్యులు

రెండ్రోజుల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన యువతి కోసం వెతుకుతుండగా తల్లిదండ్రులకు ఆమె రాసిన లేఖ దొరికింది. అందులో తాను మానసిక ఒత్తిడికి (Depression) లోనయ్యానని, అందుకే లార్డ్ శివయ్య పిలుపు మేరకు వెళ్లిపోతున్నానని పేర్కొంది. లేఖ చూసి కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.

 Hyderabad Medipally Missing Girl Letter

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు.అయితే యువతికి గతంలో ఓ యువకుడితో పరిచయం ఉండేదని.. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను మందలించరాని తెలుస్తోంది. అప్పటి నుంచి యువతి అతనితో మాట్లాడటం మానేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు స్థానికుల సమాచారంతో బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

స్నానానికి వెళ్లి విగతజీవులైన చిన్నారులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha