Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్నానానికి వెళ్లి విగతజీవులైన చిన్నారులు

స్నానానికి వెళ్లి విగతజీవులైన చిన్నారులు

వార్త 2 months ago

Kondapochamma Sagar Canal: గజ్వేల్ రూరల్ పరిధిలోని కొడకండ్ల గ్రామంలో ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

కొండపోచమ్మ సాగర్ కెనాల్‌లోకి దిగిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.

Read also: Narasaraopet Lodge Suicide Case: ఎయిమ్స్ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి!

ఘటన వివరాలు

గ్రామానికి చెందిన కుక్కల యాదగిరి, రేణుక దంపతులు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కూతురు హర్షిత, కుమారుడు మనీష్ (09) ఉన్నారు. అలాగే, కుక్కల నవీన్, లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉండగా, చిన్న కూతురు రిషిత (13).

ఆదివారం రిషిత, మనీష్ కలిసి గ్రామంలోని మామిడి తోట దగ్గరకు వెళ్లారు. అక్కడ పని నిమిత్తం పెద్దలు తోట లోపలికి వెళ్లగా, ఈ ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ కొండపోచమ్మ సాగర్ వైపు వెళ్లే కెనాల్‌ వద్దకు చేరుకున్నారు. స్నానం చేయడానికి కెనాల్‌లోకి దిగిన క్రమంలో మనీష్ నీటమునుగుతుండగా, అతడిని కాపాడే ప్రయత్నంలో రిషిత కూడా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

 Police and locals at the Kondapochamma Sagar canal after the drowning incident of two children in Gajwel

Kondapochamma Sagar Canal: పోలీసుల విచారణ

అదే సమయంలో అటుగా వెళ్తున్న 108 సిబ్బంది, కెనాల్ గట్టున బట్టలు ఉండటాన్ని గమనించారు. అనుమానంతో దగ్గరకు వెళ్లి చూడగా, నీటిలో ఇద్దరు చిన్నారులు విగతజీవులై కనిపించారు. వెంటనే వారు స్థానికులకు, కూనూరుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళ్ల ముందే పిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రియుడితో కలిసి చెల్లెలిని చంపిన అక్క!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha