Dailyhunt
లక్కీ బిర్యానీ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు

లక్కీ బిర్యానీ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు

వార్త 3 weeks ago

బిర్యానీ ఆర్డర్‌తో బయటపడిన ఘటన

Hyderabad lucky biryani issue : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో బిర్యానీకి సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

రోడ్ నెం.2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' అనే హోటల్ నుంచి ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ చేశాడు. ప్యాకెట్ తెరిచిన వెంటనే దుర్వాసన రావడంతో అది కుళ్లిపోయిన బిర్యానీ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హోటల్‌పై సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లు గుర్తించారు. ఈ ప్యాకెట్లను పాతవే అయినప్పటికీ ఆర్డర్ వచ్చినప్పుడు వేడి చేసి పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Read Also:Nora fatehi song : మహిళా కమిషన్ కఠిన హెచ్చరిక

హోటల్ యజమానిపై కేసు

జీడిమెట్లకు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈ హోటల్‌ను (Hyderabad lucky biryani issue) నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని స్టోర్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సోదాల్లో ఫ్రిడ్జ్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు కూడా బయటపడటంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. అనంతరం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నిత్యావసరాలు, గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha