Dailyhunt
మహిళా కమిషన్ కఠిన హెచ్చరిక

మహిళా కమిషన్ కఠిన హెచ్చరిక

వార్త 3 weeks ago

పాటపై మహిళా కమిషన్ ఆగ్రహం

Nora fatehi song : నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన 'సర్కే చునార్ తేరి' పాటపై వివాదం చెలరేగింది. ఈ పాటలోని సాహిత్యం మహిళల గౌరవాన్ని కించపరుస్తుందని ఆరోపణలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

చిత్ర బృందం క్షమాపణ

కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో గేయ రచయిత రకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్, కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు హాజరయ్యారు. వారు తమ తప్పును అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో మహిళల గౌరవాన్ని కించపరచే విధంగా పాటలు రూపొందించబోమని హామీ ఇచ్చారు.

Read Also:Gratuity Eligibility: కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరం.. ఏడాదికే గ్రాట్యుటీ ఇచ్చేలా కొత్త చట్టం

 Nora fatehi song

నోరా ఫతేహీకి చివరి అవకాశం

ఈ విచారణలో నోరా ఫతేహి తరఫున ఆమె న్యాయవాది హాజరయ్యారు. అయితే కమిషన్ దానిని అంగీకరించకుండా ఆమెను ఏప్రిల్ 27న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అలాగే నటుడు సంజయ్ దత్ కూడా ఏప్రిల్ 8న కమిషన్ ముందు హాజరుకావాలని సూచించింది. వివాదం తీవ్రం కావడంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మింత్రా సీఈఓ నందితా సిన్హా రాజీనామా! కొత్త బాస్ గా షారన్ పైస్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha