War Impact on India: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ సరఫరా గొలుసుపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, ప్రజలకు కీలక భరోసా ఇచ్చింది.
Read Also:Nora fatehi song : మహిళా కమిషన్ కఠిన హెచ్చరిక
తగినంత ‘బఫర్ స్టాక్’ అందుబాటులో ఉంది
దేశంలో ఆహార ధాన్యాల నిల్వలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తగినంత ‘బఫర్ స్టాక్’ అందుబాటులో ఉందని, యుద్ధం వల్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగవని పేర్కొంది.మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించింది.బియ్యం, గోధుమలు, ఉల్లి, టమాట, ఆలుగడ్డ వంటి నిత్యావసరాల ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని, వీటి ధరల్లో పెద్దగా మార్పులు ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది.
West Asia War Impact on India
War Impact on India: గ్యాస్, ఇంధన సరఫరాపై ఆందోళన వద్దు
ముడిచమురు దిగుమతులు, ఎల్‌పీజీ (LPG) సరఫరాపై వస్తున్న వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది.దేశంలోని రిఫైనరీలు ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ముడిచమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని ప్రభుత్వం తెలిపింది.దేశవ్యాప్తంగా గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, కొరత ఏర్పడుతుందనే వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన సరఫరా గొలుసు పటిష్టంగా ఉందని భరోసా ఇచ్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

