Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లక్నోకు షాక్.. ఐపీఎల్ మొత్తానికి హసరంగ దూరం

లక్నోకు షాక్.. ఐపీఎల్ మొత్తానికి హసరంగ దూరం

వార్త 2 months ago

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్, శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

హసరంగ స్థానంలో కొత్త ఆటగాడిని ఎంపిక చేసే ప్రక్రియను లక్నో యాజమాన్యం వేగవంతం చేసింది.

Read Also: Shaheen Afridi: షాహీన్ అఫ్రిది పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్

IPL 2026: గాయం, ఎన్ఓసీ (NOC) సమస్య

ఫిబ్రవరిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలో హసరంగ ఎడమ కాలి కండరాల గాయానికి గురయ్యారు.శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలకు ఆయన హాజరు కాలేకపోవడంతో, ఐపీఎల్ ఆడేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లభించలేదు. దీంతో ఆయన ఈ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

 Wanindu Hasaranga ruled out of IPL 2026

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్నో టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ఈ విషయాన్ని ధృవీకరించారు. "హసరంగ మాతో చేరడం లేదనే వాస్తవాన్ని మేము అంగీకరిస్తున్నాము. ఆయన స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో కొత్త ప్లేయర్ పేరును ప్రకటిస్తాము" అని మూడీ స్పష్టం చేశారు. హసరంగను గత వేలంలో లక్నో రూ.2 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ధోనీ స్టైల్‌లో ఫినిషింగ్.. ఎవరీ ముకుల్ చౌదరి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha