Dailyhunt
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో

వార్త 2 weeks ago

Mahabubabad ACB Raid: మహబూబాబాద్ విద్యాశాఖలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైలుపై సంతకం చేసేందుకు ఓ ఉపాధ్యాయుడి నుండి లంచం డిమాండ్ చేసిన ఇంచార్జ్ ఎంఈఓను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Read also: Venkatadri Express Attack: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై దుండగుల రాళ్ల దాడి.. పోలీసులపై ఎదురుదాడి.. ఇద్దరు అరెస్ట్!

Mahabubabad ACB Raid: అసలేం జరిగింది?

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఇంచార్జ్ ఎంఈఓగా, అయోధ్యపురంలో ప్రధానోపాధ్యాయుడిగా (Headmaster) పనిచేస్తున్న జింజిరాల రవికుమార్ అవినీతికి తెరలేపారు. అదే ప్రాంతానికి చెందిన రవీందర్ అనే ఉపాధ్యాయుడు పదవీ విరమణ పొందగా, ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైలుపై సంతకం చేసేందుకు రవికుమార్ రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు.

ఏసీబీ నిఘా.. రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు రవీందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బుధవారం తొలి విడతగా రూ. 15,000 లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రవికుమార్‌ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నేడే కీలక తీర్పు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha