Dailyhunt
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై దుండగుల రాళ్ల దాడి.. పోలీసులపై ఎదురుదాడి.. ఇద్దరు అరెస్ట్!

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై దుండగుల రాళ్ల దాడి.. పోలీసులపై ఎదురుదాడి.. ఇద్దరు అరెస్ట్!

వార్త 1 week ago

Venkatadri Express Attack: తిరుపతి వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 30 మంది దుండగుల ముఠా ఒక్కసారిగా రైలుపై రాళ్లతో దాడికి తెగబడింది.

ఈ ఘటన ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు కలిగించింది.

Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

పోలీసులపైనే ఎదురుదాడి

రైలుపై దాడి జరుగుతున్న సమయంలో గస్తీ కాస్తున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు ఏమాత్రం భయం లేకుండా పోలీసులపైనే ఎదురుదాడికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదనపు బలగాల సహాయంతో పోలీసులు దుండగులను వెంబడించారు. అయితే చీకటిని ఆసరాగా చేసుకుని 30 మంది సభ్యుల ముఠా అక్కడి నుంచి తప్పించుకుంది.

 Venkatadri Express Attack: Stone attack on Venkatadri Express by thugs.. counterattack on police.. two arrested!

ఇద్దరు మహిళలు కస్టడీలోకి

పోలీసుల గాలింపు చర్యల్లో ఈ ముఠాకు చెందిన ఇద్దరు మహిళలు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ముఠా సభ్యులు ఒడిశా, బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

భారీ కుట్ర కోణంలో దర్యాప్తు

అసలు రైలుపై రాళ్ల దాడి చేయడమే వీరి ఉద్దేశమా? లేక రైలును ఆపి దోపిడీకి పాల్పడేందుకు ప్లాన్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో దుండగులు గుమిగూడి దాడికి పాల్పడటం వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

శంషాబాద్‌లో ఏసీబీ దాడులు.. సిఐ, ఎస్ఐ అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha