Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లిక్కర్ స్కామ్‌ కేసు..ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ

లిక్కర్ స్కామ్‌ కేసు..ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ

వార్త 3 weeks ago

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో సుమారు ఏడున్నర గంటల పాటు ఈ విచారణ ప్రక్రియ కొనసాగింది.

 Vijayasai reddy ED investigation

విచారణ ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Read also:Pastor Abhinay Darshan: నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్ దర్శన్

ఫోన్ డేటా కోసమే పిలిచారు.. ప్రశ్నలు పెద్దగా లేవు: విజయసాయిరెడ్డి

AP Liquor Scam: ఫోన్ డేటా సేకరణ:

గతంలో దర్యాప్తు సంస్థలు సీజ్ చేసిన తన మొబైల్ ఫోన్‌లలోని సమాచారాన్ని సేకరించడానికే ఈడీ అధికారులు తనను పిలిచారని విజయసాయిరెడ్డి తెలిపారు. లోపల తనను పెద్దగా ప్రశ్నలేమీ అడగలేదని, కేవలం ఫోన్ డేటా బదిలీ (Data Transfer) ప్రక్రియ మాత్రమే జరిగిందని ఆయన పేర్కొన్నారు. కేసుకు అవసరమైన సమాచారం తన ఫోన్‌లో ఉందనే ఉద్దేశంతోనే అధికారులు ఆ డేటాను తీసుకున్నారని చెప్పారు.

ఆ ఒక్కరి పేరు మాత్రమే చెప్పా:

మద్యం పాలసీ వ్యవహారంలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు కేవలం రాజ్ కెసిరెడ్డికి మాత్రమే తెలుసని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలు ఆయనకే ఎరుకని తాను అధికారులకు వివరించినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా తాను రాజ్ కెసిరెడ్డి పేరు తప్ప మరెవరి పేర్లను ప్రస్తావించలేదని, అటు సిట్ (SIT) అధికారులకు, ఇటు ఈడీ (ED) అధికారులకు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశానని ఆయన అన్నారు.

నన్ను ఎవరు టార్గెట్ చేసినా నేను భయపడే వ్యక్తిని కాను. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నా.. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

జగన్‌పై అచ్చెన్న ఫైర్.. వైసీపీని పాతిపెడదాం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha