Pastor Abhinay Darshan: తనపై తానే దాడి చేయించుకుని, సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై అరెస్టయిన ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్ జైలు నుండి విడుదలయ్యారు.
దాదాపు ఎనిమిది రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవించిన ఆయన, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read also:Manthena Ramaraju: ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం.. మంతెన రామరాజు సంచలన ప్రకటన
పోలీసుల విచారణ
జైల్లో తనకు ఎదురైన అనుభవాలను అభినయ్ దర్శన్ ఈ సందర్భంగా పంచుకున్నారు. చట్టపరమైన విచారణ సమయంలో పోలీసులు, అలాగే జైలు సిబ్బంది తన పట్ల ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకున్నారని తెలిపారు. విచారణాధికారులు తనను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని, కనీసం తనపై చేయి కూడా చేసుకోకుండా గౌరవంగా విచారించారని స్పష్టం చేశారు. సబ్ జైలులో ఉన్న రోజుల్లో అక్కడి సిబ్బందితో పాటు సహచర ఖైదీలు కూడా తనను ఏ రకమైన ఇబ్బందులకు గురిచేయలేదని, అందరూ బాగానే చూసుకున్నారని వెల్లడించారు.
Pastor Abhinay Darshan: గాయపడిన సింహంలా కసితో వస్తా.. పాదయాత్రపై కీలక ప్రకటన
నా పాదయాత్ర ఆగిపోలేదు, కేవలం చిన్న విరామం మాత్రమే వచ్చింది. త్వరలోనే పాడేరు నియోజకవర్గం నుంచే నా పాదయాత్రను తిరిగి ఘనంగా ప్రారంభిస్తాను. ఇప్పుడు నేను గాయపడిన సింహం లాంటి వాడిని.. మరింత కసితో, రెట్టింపు ఉత్సాహంతో నా వేటను (కార్యక్రమాలను) మొదలుపెడతాను. ప్రజల పక్షాన నిలబడి పోరాడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని అభినయ్ దర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:
తల్లిదండ్రులకు తీరని వేదన.. నీటి కుంటలో మునిగి ముగ్గురు పిల్లలు మృతి

