HYD Lulu Mall: హైదరాబాద్ నగరంలోని KPHB పరిధిలోని ప్రసిద్ధ లులు మాల్‌లో కొనుగోలు చేసిన ఒక మిక్చర్ ప్యాకెట్‌లో ఫ్రైడ్ బల్లి వచ్చిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.
దీనిపై అప్రమత్తమైన తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ లులు హైపర్ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాల్‌లోని ఇన్‌హౌస్ కిచెన్‌లో పరిశుభ్రత లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్ పరిసరాలు, స్టోరేజ్ రూములలో పెద్ద ఎత్తున పురుగులు, కీటకాలు తిరుగుతున్నట్లు తేలింది. కూరగాయలు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నట్లు అధికారులు గుర్తించి వాటిని అక్కడికక్కడే పారవేయించారు.
Read Also : Medak Collector Gift: రామోజీ ఫిల్మ్ సిటీకి పయనమైన టెన్త్ టాపర్స్
HYD Lulu Mall: ఇన్-హౌస్ కిచెన్‌లో లోపాలు
వంటగదిలో అత్యంత శుభ్రం లేని పరిస్థితులు కనిపించాయి. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మిగిలిపోయిన ఆహారాన్ని అధికారులు అక్కడికక్కడే పారవేయించారు.వంటగది పరిసరాల్లో కీటకాలు ఉన్నట్లు, కుళ్ళిపోయిన కూరగాయలు లభ్యమయ్యాయి. ప్యాక్ చేసిన కొన్ని ఆహార పదార్థాల గడువు ముగిసిపోవడానికి దగ్గరగా ఉన్నప్పటికీ… వాటిపై చిరిగిన, ట్యాంపరింగ్ చేసేలా లేబుళ్లను అంటించినట్లు గుర్తించారు. శనగపిండి, గోధుమపిండి, పప్పుధాన్యాలలో పురుగులు పట్టినట్లు గుర్తించారు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్‌తో ఉన్న ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను గుర్తించారు. లేబులింగ్, డిస్‌ప్లే నియమాలను ఉల్లంఘించినట్లు తేలింది.
మాంసం వ్యర్థాలతో డ్రైనేజీలు పూడుకుపోయి, తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పురుగులు పట్టిన స్వీట్లు, నూనెలు, పిండి పదార్థాలు, పప్పుధాన్యాలతో సహా సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను అధికారులు పారవేశారు. పురుగులు పట్టిన శనగపిండి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
వైద్యుల నిర్లక్ష్యంతో 8 నెలల పసికందు మృతి!

