Dailyhunt
మాచర్ల అత్యాచార ఘటనలో సంచలన విషయాలు!

మాచర్ల అత్యాచార ఘటనలో సంచలన విషయాలు!

వార్త 2 weeks ago

Macherla Rape Case Updates: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఒంటరిగా ఉంటున్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై జరిగిన అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సత్తెనపల్లికి చెందిన సదరు మహిళ, ఉద్యోగ రీత్యా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఏడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమెను లక్ష్యంగా చేసుకుని ఓ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Read Also: Palnadu crime: మహిళా ఉద్యోగిపై కత్తితో బెదిరించి అత్యాచారం

కత్తితో బెదిరించి.. చున్నీతో కట్టేసి..

బాధితురాలు శుక్రవారం సాయంత్రం తన స్వగ్రామమైన సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి తలుపు తట్టడంతో ఆమె తలుపు తీశారు. వెంటనే లోపలికి ప్రవేశించిన నిందితుడు కత్తితో బెదిరించి భయాందోళనకు గురిచేశాడు. అనంతరం ఆమె చున్నీతోనే కాళ్లు, చేతులు కట్టేసి, నోరు నొక్కేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 Macherla Government Woman Employee Rape Case

Macherla Rape Case Updates: దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు

ఈ కేసును పల్నాడు పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో కీలక ఆధారాలు లభించాయి. బాధితురాలి ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తి, ఆ తర్వాత గుంటూరు బస్టాండ్‌లో బస్సు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ ఉద్యోగిపై ఇలాంటి దారుణం జరగడం మహిళా ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. నిందితుడిని వదలొద్దని ఆదేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha