Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా ఉద్యోగిపై కత్తితో బెదిరించి అత్యాచారం

మహిళా ఉద్యోగిపై కత్తితో బెదిరించి అత్యాచారం

వార్త 2 months ago

Palnadu crime: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఒక ఘోర కలికలం రేగింది. ఒంటరిగా ఉంటున్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని ఓ దుర్మార్గుడు అమానుషానికి ఒడిగట్టాడు.

బాధితురాలు సత్తెనపల్లికి చెందిన వారు కాగా, ఉద్యోగ రీత్యా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఏడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమెపై, ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు.

Read Also:Jharkhand: ఘోరం..కుమారుడి ఆరోగ్యం కోసం..కూతురిని నరబలి చేసిన తల్లి

 Government Employee Raped in Macherla

కత్తితో బెదిరించి బంధించి.. దారుణానికి ఒడిగట్టిన దుండగుడు

శుక్రవారం నాడు బాధితురాలు తన స్వగ్రామమైన సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. సాయంత్రం సమయంలో ఎవరో తలుపు తట్టడంతో ఆమె తలుపులు తెరిచారు. వెంటనే లోపలికి ప్రవేశించిన నిందితుడు కత్తితో ఆమెను బెదిరించి భయాందోళనకు గురిచేశాడు. అనంతరం ఆమె చున్నీతోనే కాళ్లు, చేతులు కట్టేసి నోరు నొక్కేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

Palnadu crime: నిందితుడి కోసం పోలీసుల గాలింపు

బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ ఉద్యోగిపై ఇలాంటి దారుణం జరగడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నమ్మించి పిలిచి.. కన్నకూతురినే కాటికి పంపిన కర్కశత్వం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha