Mangoes : మామిడి పండ్లను తినడానికి కనీసం 30 నిమిషాల నుంచి గంట సేపు నీళ్లలో నానబెట్టడం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. దీని వెనుక బలమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయి.మామిడి పండ్లలో సహజంగానే ఫైటిక్ యాసిడ్ అనే పోషక నిరోధకం ఉంటుంది.
ఇది శరీరంలో ఐరన్, జింక్ మరియు కాల్షియం వంటి ఖనిజాల శోషణను అడ్డుకుంటుంది. పండ్లను నీళ్లలో నానబెట్టడం వల్ల ఈ యాసిడ్ తొలగిపోయి, పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.
Read Also: Break Fast : రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే బ్రేక్ఫాస్ట్ లో ఇవి ఉండాల్సిందే !!
Mangoes
Mangoes : శరీర వేడిని తగ్గించడం
మామిడి పండ్లు తిన్నప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియపై ప్రభావం పడటమే కాకుండా, ముఖంపై మొటిమలు, మలబద్ధకం లేదా కడుపులో అసౌకర్యం కలగవచ్చు. నీళ్లలో నానబెట్టడం వల్ల పండులోని అధిక వేడి తగ్గి, శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
పురుగుల మందుల ప్రభావం తగ్గింపు
ప్రస్తుత కాలంలో మామిడి తోటల్లో పండ్ల రక్షణ కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడుతున్నారు. అలాగే పండ్లు త్వరగా పండటానికి కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్ వాడుతుంటారు. నీళ్లలో నానబెట్టడం వల్ల తొక్కపై ఉన్న ఈ విషపూరిత రసాయనాలు శుభ్రపడతాయి. నానబెట్టిన మామిడి పండ్లను తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
Mangoes
ఎంతసేపు నానబెట్టాలి?
సమయం ఉంటే 1 నుండి 2 గంటల పాటు నానబెట్టడం ఉత్తమం. అంత సమయం లేకపోతే కనీసం 25 నుండి 30 నిమిషాలైనా నీటిలో ఉంచడం మర్చిపోవద్దు. కేవలం రుచి కోసమే కాకుండా, పూర్తి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ చిన్న చిట్కాను పాటించండి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
Health Tips: బరువు తగ్గించే మిర్చి ఆకులు.. షుగర్ కంట్రోల్ కు అద్భుత ఔషధం!

