Dailyhunt
మార్కాపురం బస్సులో గ్యాస్ సిలిండర్.. ప్రమాదానికి కారణం అదేనా?

మార్కాపురం బస్సులో గ్యాస్ సిలిండర్.. ప్రమాదానికి కారణం అదేనా?

వార్త 3 weeks ago

Markapuram bus accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఒక ఆసక్తికర విషయం వెలుగుచూసింది. రాయవరం వద్ద హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, టిప్పర్‌ను ఢీకొన్న సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా అగ్నిప్రమాదానికి గురై దగ్ధమవ్వగా, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బస్సులో ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రమాదం జరిగిన తర్వాత బస్సు శకలాలను పరిశీలిస్తున్న సమయంలో పోలీసులకు ఈ చిన్న గ్యాస్ సిలిండర్ దొరికింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ప్రమాదకర వస్తువులను రవాణా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : Markapuram Bus Tragedy: కుమారుడుని కాపాడుకోవాలని తల్లితండ్రుల ఆరాటం.. ప్రాణాలతో బయటపడిన అమ్మ

Markapuram bus accident: పోలీసుల దర్యాప్తు.. పేలిందా లేదా?

బస్సులో మంటలు చెలరేగడానికి ఈ గ్యాస్ సిలిండర్ కారణమా? లేక ప్రమాదం జరిగిన తర్వాత మంటల వల్ల ఇది కాలిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ప్రాథమిక పరిశీలనలో సిలిండర్ పేలినట్లుగా కనిపించడం లేదని, కేవలం మంటల వల్ల నల్లగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. సిలిండర్ పేలి ఉంటే ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేదని భావిస్తున్నారు. ఈ సిలిండర్ ఎవరిది? బస్సులోకి ఎలా వచ్చింది? అనే అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బిడ్డను కాపాడి సజీవదహనమైన తల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha