Realme P Series: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రముఖ బ్రాండ్‌గా కొనసాగుతున్న రియల్‌మీ.. తన సత్తాను మరోసారి ఘనంగా చాటుకుంటోంది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన 'పీ సిరీస్' (P Series) స్మార్ట్‌ఫోన్లు అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తూ కీలక మైలురాళ్లను అందుకున్నాయి.
ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సిరీస్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Read Also: Gas ekyc: గ్యాస్ కనెక్షన్‌కు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కనెక్షన్ రద్దు !
The ‘P Series’ - Flipkart’s best-seller!
Realme P Series: ఫ్లిప్‌కార్ట్‌లో నంబర్ 1 గా రికార్డుల మోత
ఫ్లిప్‌కార్ట్ గణాంకాల ప్రకారం.. 2026 ప్రథమార్ధంలో ఈ ప్లాట్‌ఫామ్‌పై అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన స్మార్ట్‌ఫోన్ లైనప్‌గా రియల్‌మీ ‘పీ సిరీస్’ నిలిచింది. మార్కెట్ వాటా పరంగా రెండో స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా, 2026 జులై 1 నుంచి ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా రికార్డు సృష్టించింది. వివిధ ధరల విభాగాల్లోనూ రియల్‌మీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రూ.10,000-రూ.15,000 ధరల విభాగంలో ఫ్లిప్‌కార్ట్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా, రూ.15,000-రూ.25,000 విభాగంలో టాప్ 3 బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.
2026 రెండో త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తం 10 శాతం క్షీణించినప్పటికీ, రియల్‌మీ మాత్రం తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. గతేడాది 9.6 శాతంగా ఉన్న తన మార్కెట్ వాటాను 10 శాతానికి పెంచుకోవడం విశేషం. రియల్‌మీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఫ్రాన్సిస్ వోంగ్ స్పందిస్తూ.. పీ సిరీస్ విజయం మా ఈ-కామర్స్ ప్రయాణంలో మైలురాయి. పోర్ట్‌ఫోలియోను సరళీకృతం చేసి వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురావడమే ఈ వృద్ధికి కారణం అని తెలిపారు.
పండుగ సీజన్ కోసం రూ. 10 కోట్లకు పైగా పెట్టుబడులు
రానున్న దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకట్టుకునేందుకు రూ. 10 కోట్లకు పైగా పెట్టుబడులతో భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రియల్‌మీ ప్రకటించింది. వ్యూహాత్మక పెట్టుబడులతో భారత మార్కెట్‌లో దీర్ఘకాలిక వృద్ధికి కట్టుబడి ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.
Epaper: epaper.vaartha.com

