Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కుల వేటలో మేధస్సుకు సంకెళ్లు!

మార్కుల వేటలో మేధస్సుకు సంకెళ్లు!

వార్త 2 months ago

Hunting for marks : మానవ చరిత్రలో పారిశ్రామిక విప్లవం ఒకప్పుడు శారీరక శ్రమను యంత్రాలకు బదిలీ చేసి ఉత్పత్తి రంగంలో పెనుమార్పులు తెచ్చింది. నేడు మనం అటువంటిదే, అంతకంటే శక్తివంతమైన మరొక విప్లవ ముంగిట ఉన్నాం.

అదే ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) విప్లవం. ఇది కేవలం శ్రమను మాత్రమే కాదు, నేరుగా మానవ మేధస్సునే యంత్రా లతో అనుసంధానిస్తోంది. ఈ పరిణా మం కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకో లేదా టెక్నాలజీ రంగాల కో పరిమితం కాలేదు. ఇది విద్య, ఉపాధి, ఆర్థిక వ్యవస్థలు దేశాల సార్వభౌమాధికారాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయి కి చేరుకుంది. ఇలాంటి కీలక సమయంలో ప్రపంచ దేశాలు తమ విద్యా విధానాలను సమూలంగా మార్చుకుంటుంటే, భారత్ మాత్రం ఇంకా పాతకాలపు మారు్కలు, ర్యాంకులు, ఎంట్రన్స్ పరీక్షల చట్రంలోనే బందీ అయి ఉండటం ఆందో ళన కలిగించే అంశం.

Read Also : TS SA2 Exam New Schedule: మారిన ఎస్ఎ-2 టైమ్ టేబుల్

 Hunting for marks

Hunting for marks : సృజనాత్మకత ఆధారిత విద్య

ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు ఏఐని కేవలం ఒక సాంకేతికతగా కాకుండా, భవిష్యత్తును శాసిం చే ఆయుధంగా చూస్తున్నాయి. ముఖ్యంగా మన పొరుగు దేశమైన చైనా ఈ విషయంలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తోంది. 2021లో చైనా అమలు చేసిన డబుల్ రిడక్షన్ విధానం విద్యా రంగంలో ఒక సాహసోపేతమైన అడుగు. విద్యార్థులపై హోంవర్క్ ఒత్తిడిని (Stress of exams)తగ్గించి, ప్రైవేట్ ట్యూషన్ల సంస్కృతిని నియంత్రించడం ద్వారా వారుపరీక్షల ఆధారిత విద్య నుంచి సృజనాత్మకత ఆధారిత విద్య వైపు మళ్లారు. కోడింగ్, డేటా అనాలిసిస్, రోబోటిక్స్ క్రిటికల్ థింకింగ్ వంటి ఆధునిక అంశాలను ప్రాథమికస్థాయి నుంచే పాఠ్యాంశాల్లో చేర్చారు. అక్కడ టెక్నాలజీ అనేది ఒక సబ్జెక్టు కాదు, అది ఒక జీవన విధానం. ఫలితంగా, రేపటి ఏఐ ప్రపంచాన్ని శాసించే నిపుణులను వారు పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేస్తున్నారు. భారత్ పరిస్థితిని గమనిస్తే పూర్తి విరుద్ధమైన దృశ్యం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం లక్ష లాది మంది ఇంజనీర్లు, పట్టభద్రులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. కానీ, వారిలో పరిశ్రమలకు అవస రమైన నైపుణ్యాలు కేవలం 2025 శాతం మందిలోనే ఉంటున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనికి ప్రధా న కారణం మన విద్యా వ్యవస్థ ఇంకా ‘రొట్టె చదువుల’ మీదే ఆధారపడి ఉండటం.

బట్టీ పట్టించడం

ఒక విద్యార్థి ప్రతిభను కేవలం అతను సాధించిన మార్కుల ఆధారంగానే అంచనా వేయ డం వల్ల, అసలైన విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరి ష్కార సామర్థ్యం మరుగునపడిపోతున్నాయి. సిలబస్లు మారుతున్నా, బోధనా పద్ధతుల్లో మార్పు రాకపోవడం అతిపెద్ద లోపం. భారత విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్న మరో ప్రధాన సమస్య కోచింగ్ సంస్కృతి. హైదరాబాద్ లోని అశోక్ నగర్ నుంచి రాజస్థాన్లోని కోటా వరకు, విద్య అనేది ఒక అన్వేషణలా కాకుండా ఒక క్రూరమైన పోటీ పందెంలా మారిపోయింది. ఐఐటీలు, నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో ర్యాంకులు సాధించడమే పరమావధిగా మారడంతో, విద్యార్థులు తమ సహజ ఆసక్తులను, సృజనా త్మకతను కోల్పోతున్నారు. ర్యాంకుల వేటలో పడి ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల పట్ల కనీస అవగాహన పెంచుకునే సమయం విద్యార్థులకు ఉండటం లేదు. మార్కెట్లో వీటి డిమాండ్ పెరుగుతున్నా, మన కోచింగ్ సెంటర్లు మాత్రం దశాబ్దాల నాటి ఫార్ములాలను బట్టీ పట్టించడంలోనే నిమగ్నమై ఉన్నా యి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020 మార్పుకు మంచి పునాది వేసింది. పరీక్షల ఒత్తిడి (Stress of exams)ని తగ్గించడం, వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం వంటివి కాగితం మీద అద్భుతంగా ఉన్నాయి. అయితే, క్షేత్రస్థాయి లో దీని అమలు ఇంకా మందకొడిగానే సాగుతోంది. కేవలం విధాన పత్రాల్లో మార్పులు చేస్తే సరిపోదు, తరగతి గది నాలుగు గోడల మధ్య జరిగే బోధనలో మార్పు రావాలి.

సాంకేతికత ఒక సాధనం

ప్రాథమిక స్థాయి నుంచే డిజిటల్ లిటరసీని ఒక తప్పనిసరి అంశంగా మార్చాలి. సమస్యలను పరిష్కరించే ప్రాజెక్ట్ ఆధారిత విద్యను ప్రోత్సహించాలి. ఏఐ విప్లవంలో ఉపాధ్యా యుల పాత్ర అత్యంత కీలకం. ఏఐ అంటే కేవలం కంప్యూ టర్ సైన్స్ ఉపాధ్యాయులకు సంబంధించిన విషయం అనే భ్రమ నుంచి బయటకు రావాలి. భాషలు, సామాజిక శాస్త్రం, గణితం ఇలా ప్రతి సబ్జెక్టులోనూ ఏఐని ఎలా ఉప యోగించాలో ప్రతి ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. బోధనా ప్రక్రియలో సాంకేతికతను ఒక సాధనంగా మలుచుకునేలా ప్రభుత్వాలు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ఉపా ధ్యాయులు మార్గదర్శకులుగా మారినప్పుడే విద్యార్థులు ఆవిష్కర్తలుగా ఎదగగలరు. భారతదేశం లాంటి విస్తారమైన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ వ్యత్యా సం చాలా ఎక్కువగా ఉంది. నగరాల్లోని కార్పొరేట్ పాఠశా లల్లో లభించే ఏఐ ల్యాబ్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో కలల మాటగానే ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని వెంటనే తొలగించకపోతే భవి ష్యత్తులో సామాజిక అసమానతలు మరింత పెరుగుతాయి. ప్రతి గ్రామీణ పాఠశాలలోనూ డిజిటల్ మౌలిక వసతులు, వర్చువల్ లెర్నింగ్ సాధనాలను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. అప్పుడే మన ‘డెమోగ్రా ఫిక్ డివిడెండ్’ (యువశక్తి) దేశానికి ఆస్తిగా మారుతుంది.

 Hunting for marks

విలువలకు ప్రాధాన్యత

నేటి విద్యావ్యవస్థ విద్యార్థులను ‘ఉద్యోగార్థులు’గా తయారు చేస్తోంది. కానీ ఏఐ యుగంలో మనకు కావాల్సింది ‘ఉద్యోగ సృష్టికర్తలు’. స్టార్టప్ సంస్కృతిని, పరిశోధనాభిరుచినిస్కూల్ స్థాయి నుంచే ప్రోత్స హించాలి. వైఫల్యాలను తప్పుగా చూడ కుండా, వాటినుంచి నేర్చుకునేలా విద్యార్థులను సిద్ధం చేయా లి. పరిశ్రమలు విద్యాసంస్థల మధ్య బలమైన అనుసంధా నం ఏర్పడాలి. విద్యార్థులు చదువుతున్నప్పుడే వాస్తవ ప్రపం చంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా ఇంటర్న్షిప్ లను ప్రోత్సహించాలి. కేవలం విద్యా వ్యవస్థ మాత్రమే మారితే సరిపోదు, సమాజం, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి లో కూడా సమూల మార్పు రావాలి. పక్కింటి అబ్బాయికి వచ్చిన మార్కులు, ర్యాంకులతో తమ పిల్లలను పోల్చడం ఆపాలి. ఏఐయుగంలో యంత్రాలు చేయలేని పనులుఅంటే కరుణ, సృజనాత్మకత, నైతికత వంటి మానవ విలువలకు ప్రాధాన్యత పెరగనుంది. మార్కులు విజయానికి ఒక మెట్టు మాత్రమే కానీ, అవే అంతిమ లక్ష్యం కాదని గుర్తించాలి. పిల్లలు ప్రత్యేక ప్రతిభను గుర్తించి, వారిని ఆ దిశగా ప్రోత్స హించడమే తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప ఆస్తి. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. ఇది మనకు లభించిన ఒక అపూర్వమైన అవకాశం. కానీ ఈ యువశక్తికి ఆధునిక నైపుణ్యాలు అందకపోతే, అది దేశానికి ఒక పెద్ద సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ప్రపంచం ఏఐ దిశగా జెట్ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో, మనం ఇంకా ఎద్దులబండి వేగంతో సాగే పాత విద్యా విధా నాలను పట్టుకుని వేలాడటం ఆత్మహత్యాసద దృశ్యం. మార్కు ఆకోసం కాకుండా, మేధో వికాసం కోసం విద్యార్థులు శ్రమిం చాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా విద్యా సంస్కరణల కోసం ఏకం కావాలి. ఆలస్యం చేసే ప్రతి నిమిషం రాబోయే తరాల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్ట డమే. వికసిత్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే, మన తరగతి గదులు ఆధునిక దేవాలయాలుగా మారాలి.

-ఎల్లబోయిన వెంకటేశ్వర్లు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

సిఎస్ఎస్ఆర్ పోటీల్లో ఎపిఎస్టిఆర్ఎఫ్ సత్తా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha