Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle crime news: బాలిక ఘటన పై నిందుతుని తల్లిపై అనుమానాలు

Madanapalle crime news: బాలిక ఘటన పై నిందుతుని తల్లిపై అనుమానాలు

వార్త 3 months ago

Madanapalle crime news: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై జరిగిన అమానవీయ ఘటనలో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో కేవలం నిందితుడు కులవర్ధన్ మాత్రమే కాకుండా, అతని తల్లి పాత్ర కూడా ఉందని బాధిత తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

నిందితుడి వెనుక గంజాయి గ్యాంగ్?

నిందితుడు కులవర్ధన్‌కు మద్దతుగా కొంతమంది తమపై దాడికి ప్రయత్నించారని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయికి బానిసై, జులాయిగా తిరుగుతున్న ఒక ముఠా నిందితుడికి అండగా నిలుస్తోందని.. వెంటనే ఆ గ్యాంగ్‌ను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

గతంలోనూ అసభ్య ప్రవర్తన

స్థానికుల కథనం ప్రకారం.. కులవర్ధన్(Kulavardhan) గతంలో కూడా వీధిలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని సమాచారం. ఇరుగుపొరుగు వారు అతని ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కోణంలో కూడా విచారణను వేగవంతం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha