Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనేదెప్పుడు?

మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనేదెప్పుడు?

వార్త 2 months ago

Iran - israel war: మధ్య ప్రాచ్యంలో చెలరేగిన యుద్ధాగ్ని జ్వాలలు ప్రపంచా నికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అగ్రదేశానికి అధిపతినన్న అహంకారం ట్రంప్ ని యుద్ధకాంక్షను, పైశాచికత్వాన్ని బహిర్గతం చేసిం ది.

ప్రపంచ దేశాలన్నీ తనకు బాని సత్వం చేయాలని, అలాకాని పక్షంలో ఆయా దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసి, వారి బల హీనతలను ఆస రాగా చేసుకుని తన దేశ ఖజానా నింపుకోవాలని చేసే ప్రయత్నంలో భాగంగానే డోనాల్డ్ ట్రంప్ అనేక వివాదాలకు, యుద్ధాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. రెండవ సారి అధ్యక్ష పీఠం అధిష్టించిన ట్రంప్ ఆధిపత్య జాడ్యం నరనరాన జీర్ణించుకుపోయింది. ఫక్తు వ్యాపారవేత్త ఉన్నత పదవులను అలంకరిస్తే ఎలా ఉంటుందో ట్రంప్ నిరూపించాడు. టారిఫ్లను పెంచి ట్రేడ్ వార్తో ప్రపంచ దేశాలను పాదాక్రాంతం చేసుకోవాలనే దురుద్దేశ్యంతో రెచ్చిపోయిన ట్రంప్కు అమెరికా న్యాయ స్థానం చివాట్లు పెట్టింది. ట్రంప్ తమను బానిసలుగా భావి స్తున్నారనే అవమానం అమెరికా మిత్ర దేశాలను బాధించిం ది. ఈ క్రమంలోనే యూరోపియన్యూ నియన్ దేశాలు అమెరికాను తిరస్కరించి, భారత్తో ట్రేడ్డీల్ కుదుర్చుకు న్నాయి.

Read Also : Strait of Hormuz: చైనా వ్యూహం: హర్మూజ్‌లో అమెరికా.. సముద్రంలో డ్రాగన్ ఆధిపత్యం!

 iran – israel war

iran – israel war: ఎంకి పెళ్ళి సుబ్బిచావు కొచ్చిందనే విధంగా

నాటోను పేపర్ టైగర్గా అభివర్ణించిన ట్రంప్కు నాటో కూటమి దేశాలు ఇరాన్యు ద్ధ సమయంలో మొండి చేయి చూపించడం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఇప్పటికే ఆ ఇరుదేశాలు తీవ్ర వినాశనాన్ని చవి చూసాయి. లక్షలాది మంది మరణించినా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈలోగా మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధం సంభవించి, ప్రపంచదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఎంకి పెళ్ళి సుబ్బిచావు కొచ్చిందనే విధంగా ప్రపంచంలో జరుగు తున్న యుద్ధాల వలన యుద్ధాలకు సంబంధం లేని దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. అమెరికా అహానికి ఇజ్రాయిల్ ఆజ్యం పోయడం వలనే పశ్చిమాసియా భగ్గుమంటున్నది. కేవలం ఒకటి రెండు రోజుల్లో యుద్ధాన్నిముగించి, ఇరాన్ లో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తలంచిన అమెరికాకు ఇరాన్ తనదైన శైలిలో గుణపాఠం నేర్పింది. అమెరికా ఆధునిక టెక్నాలజీ, అధునాతన యుద్ధ పరికరాలను, క్షిపణులను, యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చి వేయడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోయింది. ఇరాన్ డ్రోన్లు అమెరికా ఆయుధ సంపత్తిని హరించాయి. ఇరాన్పై అమె రికా ఇజ్రాయిల్ దేశాలు ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ వలన జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడంలో జాప్యం జరిగే కొద్దిప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకోవడం తథ్యం.

చర్చల్లో ప్రతిష్టంభన

ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపించగా ఇరాన్ కూడా’ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4′ పేరుతో ఇరు దేశాలకు పట్టపగలే చుక్కలు చూపించింది. అమెరికా ఈ యుద్ధంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. హార్ము జ్ జలసంధి ఇరాన్ యుద్ధ వ్యూహానికి కేంద్రంగామారింది. అమెరికా ఆర్థికంగా తీవ్ర స్థాయిలో దెబ్బతినడం, అమెరికా లో వెల్లువెత్తిన ట్రంప్ వ్యతిరేకప్రదర్శనలు, ప్రపంచ వ్యా ప్తంగా ట్రంప్కు వ్యతిరేక పవనాలు వీయడంతో ఏదో ఒక విధంగా ఈ యుద్ధాన్ని ముగించాలని పాకిస్థాన్లో మధ్య వర్తిత్వం నడిపించినా ఫలితం నిరాశాజనకంగానే మారింది. ఉగ్రవాద దేశమైన పాక్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరగడం, అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్ ఇరాన్ ప్రతినిధి బృందంతో 21గంటల పాటు సుదీర్ఘమంత నాలు సాగించినా చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడం పరిస్థితిని మొదటికి తీసుకు వచ్చింది. ఇరాన్ ప్రాచీన చరిత్రనునాశనం చేస్తానని, పాత రాతియుగం వైపు ఇరాన్ను తీసుకు పోతానని శపథం చేసిన ట్రంప్ రెండువారాల కాల్పుల విరమణ ను ప్రకటించి శాంతి ప్రతిపాదనలతో ఇరాను ఒప్పించడా నికి పాకు మధ్యవర్తిగా నియమించడం జరిగింది.

శాంతి చర్చలు విఫలం

ఇస్లామా బాద్లో శాంతి చర్చలు విఫలం కావడంతో ట్రంప్ మళ్ళీ ఇరాన్ను నాశనం చేస్తానంటూ పాత పాట పాడడమే కాకుండా, హర్ముజ్ జలసంధిని విముక్తి చేస్తానంటూ ప్రతిన బూని, హర్మజ్ జలసంధి మీదుగా ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్ళే అన్నిసముద్ర మార్గాలను తమ నియంత్రణలోకి తెచ్చు కుంటునట్టు చేసిన ప్రకటన ద్వారా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్త స్థాయికి వెళ్ళాయి. హార్ముజ్ స్ట్రయిట్లో సీమైన్స్తొ లగిస్తా మని చెప్పడం ఆచరణ సాధ్యమని చెప్పలేం. శాంతి చర్చలు విఫలం కావడంలో ఇజ్రాయిల్ పాత్ర ఉన్నట్టు ఇరాన్ ఆరో పించింది. తమ ప్రతిపాదనలకు అంగీకరించకపోవడం ఇరాన్ కే నష్టమని జెడివాన్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పాకి స్థాన్ దౌత్యాన్ని ఇరాన్ విశ్వసించలేదని అవగతమవుతున్న ది. అమెరికా తొత్తుగామారిన పాక వలన ఒరిగేదేమీ ఉండదు. అమెరికా సూచనలతోనే ఇరాన్ ను దెబ్బతీయడానికి సౌదీకి భారీ బలగాలను పాక్ పంపుతున్నట్టుగా భావించాలి. అమెరికాకు మద్దతునిస్తున్న గల్ఫ్ దేశాలను ఇరాన్ విడిచిపెట్ట దన్న విషయం విదితమే.

 iran – israel war

బ్రతుకు దెరువు కష్టతరం

“సౌత్ పార్స్ గ్యాస్ఫీ ల్డ్” పై దాడి చేసిన ఇజ్రాయిల్ చర్యకు ప్రతీకారంగా ఖతార్గ ల ‘రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ’లోని ఎల్ఎన్జీజీ ఉత్పత్తి క్షేత్రంపై ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడిన ఉదంతం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. విద్యుత్ కేంద్రాల పైన, నీటివసతుల పైన దాడులు చేస్తామని బెదిరించిన ట్రంప్ ఉన్మాదాన్ని ఇరాన్ ప్రజలు భారీ మానవ హారంగా ఏర్పడి భగ్నంచేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ చేసే ఒంటరి పోరాటంలో చివరికి ఇరాన్ పూర్తిగా విధ్వంసం కాకతప్పదా? అలా జరిగిననాడు ఇరాన్ తన పొరుగునున్న దేశాలను విడిచి పెడుతుందా? ఇలాంటి సందేహాలెన్నో తలెత్తుతున్నాయి. అయతుల్లా ఖమెనీ అంతం తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్డీసీ) ‘ట్రూత్పల్ ప్రామిస్ 4ఖి ఆపరేషన్ పేరుతో గల్ఫ్ గల అమెరికా స్థావరాలను, లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తున్నది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ప్రపంచ దేశాలు చమురు కొరతతో ఒక వైపు తీవ్ర ఇబ్బం దులకు గురౌతుంటే, పెరిగిన ద్రవ్యోల్బణం బ్రతుకు దెరువు ను కష్టతరంగా మార్చింది. ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఇరాన్ దేశాలు పరస్పరం మాటలతో కత్తులు దూసుకుంటున్నాయి. ఇజ్రాయిల్ అధ్య క్షుడు బెంజిమన్ నెతన్యాహూ కూడా యుద్ధ విరమణకు సుముఖంగా లేరనే విషయం సుస్పష్టం. ఇజ్రాయిల్ శల్య సారధ్యమే ట్రంప్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇప్ప టికైనా ప్రపంచ దేశాలు ఐక్యమై ఇరాన్పై అమెరికా, ఇజ్రా యిల్లు సాగిస్తున్న యుద్ధాన్ని నిలువరించాలి.

-సుంకవల్లి సత్తిరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అమెరికాలో అదృశ్యమైన పదిమంది శాస్త్రవేత్తల కలకలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha