తెలంగాణలో పెరుగుతున్న ఎండలు
Heat Warning : తెలంగాణ రాష్ట్రంలో గడచిన వారం రోజులుగా ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతల్లో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీలు నమోదయ్యాయి.
పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉదయం నుంచే తీవ్ర ఎండ
ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అత్యధిక స్థాయికి చేరుతోంది. ఉదయం మరియు రాత్రి ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also:Manoor ASI Govind Nayak: పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి!
Heat Warningమంత్రి సీతక్క హెచ్చరిక
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మంత్రి సీతక్క ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పనులు ఉంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య పూర్తి చేసుకోవాలని తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బయటకు రావాల్సి వచ్చినప్పుడు టోపీ లేదా తలపాగా ధరించాలని మంత్రి సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉపాధి హామీ కార్మికులకు పనిస్థలాల్లో తాగునీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి యుద్ధం - దక్షిణాది సీఎంలకు లేఖలు!

