Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు

మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు

వార్త 3 months ago

Raj Kesireddy Assets seizure: ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అక్రమ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలోని షాబాద్, జనగామ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన బినామీ భూములను సిట్ (SIT) గుర్తించడం ఈ కేసులో కీలక మలుపు తిరిగింది.. మద్యం స్కామ్ ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.

Read Also: Eluru Crime: ఇన్‌స్టా ప్రేమ.. వివాహిత ఆత్మహత్య

Raj Kesireddy Assets seizure: షాబాద్‌లో భారీ భూదందీ

మద్యం స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులతో రాజ్ కేసిరెడ్డి తన తల్లిదండ్రుల పేరిట తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా షాబాద్‌లో తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరుతో కొన్న 17.60 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ. 70 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం రూ. 2.69 కోట్లుగా చూపించారు. అలాగే జనగామలో తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరుతో లక్షల విలువైన ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు.

 AP Liquor Scam Update

ఈ బినామీ ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డికి సంబంధించి వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ, సిట్ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా గుర్తించిన రూ. 70 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతిని కోరగా..ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏజెన్సీలో డ్రోన్ కలకలం: అసలేం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha