Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్యం కుంభకోణంలో జగన్ పీఏ కేఎన్ఆర్ ఇంట్లో సిట్ సోదాలు

మద్యం కుంభకోణంలో జగన్ పీఏ కేఎన్ఆర్ ఇంట్లో సిట్ సోదాలు

వార్త 3 weeks ago

SIT Raids: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరింత వేగవంతం చేసింది.

ఈ కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (PA) కె. నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) టార్గెట్‌గా సిట్ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం విజయవాడలోని ఆయన నివాసంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మద్యం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసమే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

 jagan pa knr

9.5 గంటల సుదీర్ఘ విచారణ.. పొంతనలేని సమాధానాలు!

ఒకవైపు కేఎన్ఆర్ నివాసంలో సోదాలు జరుగుతుండగానే, మరోవైపు సిట్ కార్యాలయంలో ఆయనపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం 11 గంటల నుంచే అధికారులు ఆయనను విచారించడం ప్రారంభించారు. దీనికి ముందు బుధవారం కూడా సిట్ అధికారులు కేఎన్ఆర్‌ను దాదాపు 9.5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే ఈ విచారణ సందర్భంగా అధికారులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా, పొంతనలేని జవాబులతో దాటవేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Read also: AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌ కేసు..ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ

SIT Raids: ఐదేళ్లలోనే కోట్ల ఆస్తులు.. భార్య ఖాతాలోకి రూ. 19.86 కోట్లు!

సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కేఎన్ఆర్, వైసిపి ఐదేళ్ల పాలనలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో ఒక అంచనాకు వచ్చింది. కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంక్ అకౌంట్‌లో 2019 నుండి 2024 మధ్య కాలంలో సుమారు రూ. 19.86 కోట్లు జమ అయినట్లు సిట్ గుర్తించింది. వీటికి తోడు విజయవాడలో ఒక కార్ షోరూంలో వాటా,తిరుపతి జిల్లాలో ఆమె పేరిట 10 ఎకరాల భూమి ఉన్నట్లు తేలింది. వీటితో పాటు హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి వంటి నగరాల్లో పలు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే, మరోవైపు నివాసంలో సోదాలు జరగడం ఈ కేసులో తీవ్రతను తెలియజేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

జగన్‌పై అచ్చెన్న ఫైర్.. వైసీపీని పాతిపెడదాం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha