Dailyhunt
మద్యం ప్రియులకు షాక్: తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

మద్యం ప్రియులకు షాక్: తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

వార్త 2 weeks ago

Liquor Prices hike: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు తెలంగాణలోని మద్యం ధరలపై పడనుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ (Supply Chain) దెబ్బతింది.

దీనికి తోడు రాష్ట్రంలో మద్యం ధరల సమీక్ష గడువు ముగిసిపోవడం, గాజు సీసాల తయారీ ఖర్చులు భారీగా పెరగడంతో ధరల పెంపు అనివార్యమని డిస్టిలరీ యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించిన కంపెనీలు, 12 శాతం నుండి 15 శాతం వరకు ధరలను పెంచాలని కోరుతున్నాయి.

Read Also:Suryapet Fine Rice Scam: సూర్యాపేట జిల్లాలో సన్నబియ్యం కుంభకోణం

 Shortage of Liquor Bottles… Soaring Demand for Beer This Summer… Prices hike

గ్యాస్ కొరత.. సీసాల ఉత్పత్తిలో భారీ కోత

యుద్ధం కారణంగా నేచురల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మద్యం సీసాల తయారీ యూనిట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి దాదాపు 40 శాతం పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20 శాతం మేర పెరిగాయి. ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని, వెంటనే ధరలను సవరించాలని తయారీదారులు ఎక్సైజ్ శాఖను కోరారు. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి ధరలను సమీక్షించాల్సి ఉండగా, 2023 మే నెల తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు చేయలేదు.

Liquor Prices hike: 5 స్లాబుల్లో ధరల పెంపు.. బీర్లపైనా ప్రభావం

ధరల పెంపు అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మద్యం బాటిల్ సైజు (క్వార్టర్, హాఫ్, ఫుల్), బ్రాండ్ రకం (ప్రీమియం, మీడియం) మరియు ట్యాక్స్ స్లాబులను బట్టి ధరలను నిర్ణయించనున్నారు. మరోవైపు, వేసవిలో అధిక డిమాండ్ ఉండే బీర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అల్యూమినియం క్యాన్ల ధరలు పెరగడం మరియు సరఫరా 20 శాతం తగ్గడంతో మార్కెట్‌లో బీర్ల కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపండి.. మంత్రి తుమ్మల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha