Pradeep Rawat: భారతీయ సినీ పరిశ్రమలో పవర్ ఫుల్ విలనిజంతో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (Pradeep Rawat) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతితో టాలీవుడ్ సహా భారతీయ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
Read Also :Pradeep Ravath : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్ మృతి

అనారోగ్యం & అంత్యక్రియల వివరాలు
- క్యాన్సర్‌తో పోరాటం: 2022లో ప్రదీప్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నెల రోజులకు పైగా కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్లేట్‌లెట్లు గణనీయంగా పడిపోవడంతో కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.
- అంత్యక్రియలు: ఆగస్టు 5 (బుధవారం) సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నివాళుల అర్పణ కోసం పార్థివ దేహాన్ని గోరేగావ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు.
- కుటుంబం: ప్రదీప్ రావత్‌కు భార్య కళ్యాణి, 18 ఏళ్ల కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు.
Pradeep Rawat: బి.ఆర్. చోప్రా 'మహాభారత్' నుంచి టాలీవుడ్ 'సై' వరకు..
- కెరీర్ ప్రారంభం: 80వ దశకంలో 'ఐత్‌బార్' సినిమాతో నటన ప్రారంభించిన ఆయన, బి.ఆర్. చోప్రా 'మహాభారత్' సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
- టాలీవుడ్ ఎంట్రీ: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' చిత్రంలో భిక్షు యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అపారమైన ప్రాచుర్యం పొందారు.
- ప్రసిద్ధ చిత్రాలు: భద్ర, అందరివాడు, జగడం, దేశముదురు, ఛత్రపతి, నాయక్, వాల్తేరు వీరయ్య, నేనే రాజు నేనే మంత్రి వంటి 150కి పైగా చిత్రాలలో నటించారు. తమిళ, హిందీ భాషల్లో వచ్చిన 'గజిని' చిత్రం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
- చివరి చిత్రాలు: హిందీలో 'ఛావా', కన్నడలో విడుదల కావాల్సిన 'త్రిశూలం' ఆయన చివరి చిత్రాలుగా నిలిచాయి.

