Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహానాడు గ్రాండ్ సక్సెస్.. విజయాన్ని అందరికీ అంకితం: నారా లోకేష్

మహానాడు గ్రాండ్ సక్సెస్.. విజయాన్ని అందరికీ అంకితం: నారా లోకేష్

వార్త 2 weeks ago

Mahanadu Grand Success : తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'మహానాడు 2026' నిన్నటితో అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పందిస్తూ ఈ పసుపు పండుగను గ్రాండ్ సక్సెస్ చేయడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

కోట్లాది మంది కుటుంబ సభ్యుల ఆశీస్సులతోనే తాను వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టానని గుర్తుచేసుకున్న ఆయన, ఈ కొత్త పదవిలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి మహానాడు ఇదే కావడం విశేషమన్నారు. యావత్ టీడీపీ టీమ్ పడిన కష్టానికి దక్కిన ఫలితమే ఈ విజయమని కొనియాడారు.

 Lokesh Dedicates Mahanadu Victory

మహానాడు 2026 సాధించిన ఈ అద్భుత విజయాన్ని పార్టీ అగ్రనేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, మహానాడు కమిటీలు, కేంద్ర కార్యాలయ యంత్రాంగం, బ్యాక్ ఆఫీస్, సాంకేతిక సిబ్బందితో పాటు MYTDP, ITDP, పార్టీ అనుబంధ సంఘాలు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా సైన్యం, ఎన్ఆర్ఐలు, మిత్రపక్షాలు, సాధారణ ప్రజలు మరియు రక్షణ సిబ్బందికి అంకితం ఇస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. నిరంతరం శ్రమించిన ప్రతి ఒక్కరి కృషికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు.

Read also:YS Sharmila: రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ

Mahanadu Grand Success : నెల్లూరు నుంచి హైబ్రిడ్ మోడ్‌లోకి!

వాస్తవానికి ఈ ఏడాది మహానాడును నెల్లూరులో ఘనంగా నిర్వహించాల్సి ఉంది. అయితే, దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, అందరి ఆమోదంతో ఈ వేడుకను తక్షణమే ‘హైబ్రిడ్’ విధానంలోకి మార్చాల్సి వచ్చిందని లోకేష్ స్పష్టం చేశారు. ఈసారి జరిగిన మహానాడు కేవలం రాజకీయ వేదికగానే కాకుండా ఒక చారిత్రాత్మక నిర్ణయానికి వేదికైందని లోకేష్ పేర్కొన్నారు. పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహానాడు వేదికగా ఆమోదించిన తీర్మానం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు దారితీసిందని చెప్పారు. మహిళా సాధికారతకు అద్దం పట్టేలా తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం.. మహానాడు సాధించిన మరో అరుదైన మరియు ఘన విజయమని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha