Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు

మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు

వార్త 2 weeks ago

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం 'మహానాడు' తొలిరోజు వేడుకలు అద్భుత విజయవంతమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుతున్న సాంకేతిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సరికొత్తగా “హైబ్రిడ్” విధానంలో నిర్వహించిన ఈ మహానాడుకు ఊహించని స్థాయిలో స్పందన లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కేవలం మొదటి రోజే దాదాపు 7.50 లక్షల మంది ప్రతినిధులు, అభిమానులు వర్చువల్ (డిజిటల్) పద్ధతిలో ఈ పసుపు పండుగలో భాగస్వాములయ్యారని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

 cm chandrababu naidu reacts

Read also: TDP Mahanadu: మహానాడు వేదికగా కూటమి ప్రభుత్వంపై ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసల జల్లు

1,875 క్లస్టర్లలో వేడుకలు.. కీలక తీర్మానాలపై విస్తృత చర్చ

గతంలో ఏదో ఒక నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే జరిగే మహానాడును, ఈసారి మరింత విస్తృతం చేస్తూ ఏకంగా 1,875 క్లస్టర్లలో నిర్వహించినట్లు చంద్రబాబు వివరించారు. సరికొత్త రికార్డులు సృష్టించడం, మళ్లీ వాటిని తామే తిరగరాయడం కేవలం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఈ కార్యక్రమ విజయంతో మరోసారి నిరూపితమైందని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ మాధ్యమం ద్వారా ఇంత భారీ సంఖ్యలో కేడర్ ఏకతాటిపైకి రావడం పార్టీ పటిష్టతకు అద్దం పడుతోందన్నారు.

మహానాడు తొలిరోజు సభల్లో భాగంగా సమాజానికి ఎంతో కీలకమైన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, తీర్మానాలు ఆమోదించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వాటిలో ముఖ్యమైనవి. స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, యువగళం ,పేదల సేవ వంటి కీలక తీర్మానాలపై చర్చించినట్లు తెలిపారు.

Chandrababu Naidu: 23 నెలల పాలనపై సమీక్ష.. భవిష్యత్తుకు దిశానిర్దేశం

ఈ మహానాడు వేదికగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గడిచిన 23 నెలల కాలంలో సాధించిన ప్రగతి, అందించిన పాలనపై సమగ్రంగా సమీక్షించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటూ కార్యకర్తలు చూపిన ఉత్సాహం పార్టీలో కొత్త జోష్ నింపిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

భూమి పరిహారం పెంపుపై హైకోర్టు కీలక తీర్పు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha