Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహానాడు వేదికగా కూటమి ప్రభుత్వంపై ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసల జల్లు

మహానాడు వేదికగా కూటమి ప్రభుత్వంపై ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసల జల్లు

వార్త 2 months ago

TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు సభలలో ఒక అద్భుతమైన, చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వద్ద పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ట్రాన్స్‌జెండర్ వర్షిణి, ఈ వేదికపై నుండి ప్రసంగించారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ వర్గం జీవితాల్లో సరికొత్త కాంతులు నింపుతోందని చెబుతూ ఆమె సభలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వర్షిణి పంచుకున్న అనుభవాలు, మాటలు మహానాడుకు విచ్చేసిన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి.

 Mangalagiri Mahanadu

Read also: Land Acquisition Compensation:భూమి పరిహారం పెంపుపై హైకోర్టు కీలక తీర్పు!

నాడు వివక్ష.. నేడు అండగా కూటమి సర్కార్

మంగళగిరి వేదికగా సాగుతున్న ఈ మహానాడు సభలో వర్షిణి మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, ఎదుగుదల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోందని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏ పాలకుడూ, ఏ రాజకీయ పార్టీ కూడా తమ సామాజిక వర్గం గురించి ఇంతగా ఆలోచించలేదని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తమకు సమాజంలో తగిన గౌరవాన్ని, గుర్తింపును అందిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, అందులో తమ వర్గానికి చెందిన వారికే ప్రాతినిధ్యం కల్పించడం అనేది విప్లవాత్మకమైన మార్పు అని ఆమె కొనియాడారు.

TDP Mahanadu:ఇది మా వర్గానికి దక్కిన అత్యున్నత గౌరవం

ఒక సామాన్య ట్రాన్స్‌జెండర్‌ను ఏకంగా ఒక శాసనసభ్యురాలికి పీఏగా నియమించడమే కాకుండా, పార్టీకి అత్యంత కీలకమైన మహానాడు వంటి ప్రధాన వేదికపై మాట్లాడే అరుదైన అవకాశాన్ని కల్పించడం తమ వర్గానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వర్షిణి పేర్కొన్నారు. ఈ నిర్ణయం తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, తమ వర్గం అభ్యున్నతికి తోడ్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

అకాల వర్షాలకు అతలాకుతలమైన అరటి తోటలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha