Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహానీయుల అడుగుజాడల్లో నడవాలి .. జైపాల్ నాయక్

మహానీయుల అడుగుజాడల్లో నడవాలి .. జైపాల్ నాయక్

వార్త 4 months ago

Jagjivan Ram Jayanthi 2026: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెం గ్రామంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Read Also:Choutakur: సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగ ఆరాధనలు

Jagjivan Ram Jayanthi 2026: ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటంతో పాటు సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల సాధనకు నిరంతరం పోరాడిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కులరహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల ఆదర్శ నాయకుడిగా ఆయన నిలిచారని తెలిపారు. మహానీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు, వార్డు సభ్యులు సుభాష్, మాజీ బిహెచ్ఎల్ విశ్రాంత ఉద్యోగి శంకర్ నాయక్, ఆర్ఎంపీ డాక్టర్ రమేష్, రాజ్ కుమార్, విజయ్, సంతోష్ నాయక్, విగేష్, బొమ్మరాజు శ్రీనివాస్, సర్వన్ నాయక్, మూడ్ రాజు, ప్రభు, ఆంజనేయులు, మోక్ష జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ గొల్ల మల్లేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha