Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహారాష్ట్రలో ఎండల బీభత్సం..అకోలాలో 46.9 డిగ్రీల రికార్డు నమోదు

మహారాష్ట్రలో ఎండల బీభత్సం..అకోలాలో 46.9 డిగ్రీల రికార్డు నమోదు

వార్త 1 month ago

Weather Update: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అకోలా జిల్లాలో ఆదివారం ఏకంగా 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, ఇది ఈ సీజన్‌లోనే దేశంలో అత్యధికం కావడం గమనార్హం.

మార్చి నెల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, ఏప్రిల్ నాటికే మెజారిటీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్కును దాటేశాయి.

Read Also :AP Weather Updates: ఎండ దెబ్బ మామూలుగా లేదుగా.. నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు!

Weather Update: నిప్పుల కొలిమిలా మహారాష్ట్ర

నాగ్‌పూర్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వారం దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకోలా తర్వాత అమరావతిలో 46.8 డిగ్రీలు, వార్దాలో 46.4 డిగ్రీలు, యవత్మాల్‌లో 46 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాగ్‌పూర్ (45.4), చంద్రాపూర్ (45) ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ప్రజలను వణికిస్తోంది.

తీవ్రమైన వడగాలుల (Heat Waves) నేపథ్యంలో విదర్భ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కనీసం మంగళవారం వరకు ఈ వడగాలుల ప్రభావం ఉంటుందని, మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. కర్నూలులో 44.8 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha