Dailyhunt
మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పారు: బండి సంజయ్

మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పారు: బండి సంజయ్

వార్త 5 days ago

Election Results: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మూడు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉండటంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

Read Also : Election Results: బెంగాల్, అస్సాంలో బీజేపీ జోరు

Election Results: ప్రజలు బుద్ధి చెప్పారు!

మహిళా బిల్లును, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించిన పార్టీలకు ఈ ఫలితాలు ఒక గుణపాఠమని బండి సంజయ్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు ప్రజలు ఓటు ద్వారా తగిన సమాధానం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

రాహుల్ గాంధీపై విమర్శలు

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోతోందని, ఆ పార్టీ ఇకపై అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన విమర్శించారు. “కాంగ్రెస్ నాయకులే రాహుల్ గాంధీని ఒక నాయకుడిగా గుర్తించడం లేదని, అలాంటి వ్యక్తి దేశాన్ని ఎలా నడిపిస్తారు?” అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ విజయాలకు సంకేతమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రాల వారీగా ప్రస్తుత పరిస్థితి

  1. బీజేపీ హవా: మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా ఉంది.
  2. తమిళనాడు: హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  3. కేరళ: యూడీఎఫ్ (UDF) కూటమి విజయం దిశగా సాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

అధికారం పోతే పార్టీ క్లోజ్.. మమతకు తప్పని గండం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha