Myntra CEO Nandita Sinha: ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రా (Myntra) నాయకత్వంలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. గత కొన్నేళ్లుగా సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న సీఈఓ నందితా సిన్హా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఐపీఓ (IPO)కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also:Gratuity Eligibility: కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరం.. ఏడాదికే గ్రాట్యుటీ ఇచ్చేలా కొత్త చట్టం
నందితా సిన్హా స్థానంలో షారన్ పైస్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దాదాపు 13 సంవత్సరాల క్రితం ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో చేరిన నందితా సిన్హా, 2022లో మింత్రా సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్‌కు కూడా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. మింత్రా సీఈవోగా నందితా సిన్హా వైదొలగిన తర్వాత, షారన్ పైస్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె రాజీనామాకు కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అమెజాన్ ఫ్యాషన్, రిలయన్స్ ఏజియో, నైకా ఫ్యాషన్ , మీషో వంటి ప్లాట్‌ఫామ్‌లకు, మింత్రా ఇండియాలోని ఆన్‌లైన్ ఫ్యాషన్ మార్కెట్‌లో గట్టి పోటీనిస్తుంది.
Myntra CEO Nandita Sinha Resignation
Myntra CEO Nandita Sinha: ఎవరీ షారన్ పైస్?
షారన్, ప్రస్తుతం ఫ్యాషన్ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేస్తున్నారు. బెంగళూరుకు చెందిన మింత్రా ఇ-కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థ. క్లియర్ ట్రిప్, ఈకార్ట్, షాప్‌సే వంటివి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లోని ఇతర కంపెనీలు. షారన్ పైస్ గతంలో మింత్రాలో లీడర్‌షిప్ రోల్ చేపట్టారు, సుమారు 4 సంవత్సరాల పాటు ఈ కంపెనీకి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO)గా పనిచేశారు. గత ఏడేళ్లుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో వివిధ సీనియర్ రోల్స్‌లో పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో చేరకుందు 2014లో ప్రాక్టర్ & గాంబుల్‌లో మేనేజర్ పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం ఈమె నందితా సిన్హా స్థానంలో మింత్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
"భారత్‌తో యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాం"! ఖవాజా ఆసిఫ్

