Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం.. ఆగస్టు 1 నుంచే దరఖాస్తులు!

మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం.. ఆగస్టు 1 నుంచే దరఖాస్తులు!

వార్త 1 week ago

Delhi Lakshmi Yojana: మహిళల ఆర్థిక సాధికారత, స్వయం సమృద్ధి లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. 'ఢిల్లీ లక్ష్మీ యోజన' (Delhi Lakshmi Yojana) పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు ₹2,500 (ఏడాదికి ₹30,000) చొప్పున నేరుగా ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఎన్నికల వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. రాబోయే రక్షాబంధన్ పండుగ నాటికి సుమారు 17 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్యం పెట్టుకుంది.

Read Also:Delhi Neet Protest: విద్యార్థులపై లాఠీఛార్జ్ సాధారణ శాంతిభద్రతల అంశమే:కేంద్ర మంత్రి జేపీ నడ్డా

అర్హత నిబంధనలు (వయస్సు & ఆదాయ పరిమితి)

  • వయోపరిమితి: 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను (Income Tax) లేదా GST చెల్లింపుదారులు అయి ఉండకూడదు.
  • నివాస ధ్రువీకరణ: సదరు మహిళ లేదా ఆమె భర్త/తల్లిదండ్రులు కనీసం 10 సంవత్సరాలుగా ఢిల్లీలో నివసిస్తూ ఉండాలి.
  • కుటుంబంలో ఒకరికే ప్రాధాన్యత: ఒక కుటుంబం నుండి ఒక మహిళకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ మంది అర్హులు ఉంటే, పెద్ద వయస్సు ఉన్న మహిళకే ప్రాధాన్యత ఇస్తారు.

ఎవరెవరు అనర్హులు?

  • పిల్లల సంఖ్య: ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలు దరఖాస్తు చేయలేరు.
  • విద్యుత్ వినియోగం: సంవత్సరానికి 2,400 యూనిట్లకు పైగా విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలు అనర్హులు.
  • వాహనాలు & ఇతర పథకాలు: సొంతంగా నాలుగు చక్రాల (Four-wheeler) వాహనం ఉన్నవారు లేదా ఇప్పటికే ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం పొందుతున్నవారు అర్హులు కారు.
  • ప్రభుత్వ ఉద్యోగులు: ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ పింఛను పొందుతున్న కుటుంబాల మహిళలు, నేర చరిత్ర ఉన్న మహిళలు ఈ పథకానికి అనర్హులు.

సొమ్ము జమ చేసే విధానం (రెండు ఎంపికలు)

మహిళల్లో పొదుపు మరియు పెట్టుబడి అలవాట్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డబ్బు జమ చేయడంలో రెండు ప్రత్యేక ఎంపికలను ప్రవేశపెట్టింది:

  1. మొదటి ఎంపిక (వాలెట్ + పొదుపు): నెలకు ఇచ్చే ₹2,500 లో ₹1,500 ను రికరింగ్ డిపాజిట్ (RD) లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లో జమ చేస్తారు. మిగిలిన ₹1,000 ను ఆర్‌బీఐ (RBI) ఆధారిత 'CBDC డిజిటల్ వాలెట్' లో జమ చేస్తారు.
  2. రెండవ ఎంపిక (పూర్తి పొదుపు): మొత్తం ₹2,500 ను నేరుగా RD/FD లలో జమ చేయవచ్చు. ఈ డిపాజిట్‌కు మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మూడేళ్ల తర్వాత మాత్రమే ఈ మొత్తాన్ని వడ్డీతో సహా విత్‌డ్రా చేసుకోవడానికి వీలవుతుంది.

డిజిటల్ వాలెట్ వినియోగంపై నిబంధనలు

CBDC డిజిటల్ వాలెట్‌లో జమ అయ్యే ₹1,000 ను ప్రభుత్వం నిర్ధారించిన నిత్యావసర వస్తువులు మరియు సేవలకు మాత్రమే ఖర్చు చేయాలి. ఈ డబ్బుతో మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలు, లాటరీ టిక్కెట్లు లేదా జూదం వంటి వాటిని కొనుగోలు చేయడానికి వీలుండదు.

Delhi Lakshmi Yojana: దరఖాస్తు విధానం

ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. వీలైనంత ఎక్కువ మంది అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకునేలా ప్రక్రియను అత్యంత సరళంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే దరఖాస్తుదారుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

కేంద్రానికి CJP హెచ్చరిక.. కేసులు ఎత్తి వేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha