బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ శుక్రవారం విడుదల చేసిన తన మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. బీజేపీ కనుక అధికారంలోకి వస్తే చొరబాటుదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని స్పష్టం చేసింది.
బంగాల్లోని ప్రతి మహిళకు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘం ఏర్పాటు చేస్తామని పేర్కొంది. బంగాల్ ఎన్నికల కోసం బీజేపీ శుక్రవారం సంకల్ప పత్రం (మేనిఫెస్టో) విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సంకల్ప పత్రం రైతులు, మహిళలు, యువతకు మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు.
Read Also: HDFC Banking Services Down: రేపు తెల్లవారుజామున బ్యాంకింగ్ సేవలు బంద్!
BJP Manifesto
BJP Manifesto: చొరబాటుదారులపై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్
మరోవైపు అధికారంలో ఉన్న మమత బెనర్జీ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ప్రజలకు ఒక పీడకలగా మారిందని విమర్శించారు. చొరబాట్లను, సరిహద్దు భద్రతను ప్రధాన ఎన్నికల అంశాలుగా బీజేపీ పరిగణిస్తోంది. అందుకే బంగాల్లో తమ సర్కార్ ఏర్పడితే చొరబాటుదారులపై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ (గుర్తించడం, తొలగించడం, బహిష్కరించడం) విధానాన్ని అనుసరిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయంతో తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకెళ్తుందని తేల్చిచెప్పారు. బంగాల్లోని పౌరులందరికీ ఒకే చట్టం ఉండేలా చర్యలు తీసుకుంటామని అమిత్ షా పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

