Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు తెల్లవారుజామున బ్యాంకింగ్ సేవలు బంద్!

రేపు తెల్లవారుజామున బ్యాంకింగ్ సేవలు బంద్!

వార్త 2 months ago

HDFC Banking Services Down: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి (HDFC) తన వినియోగదారులకు కీలక సమాచారం అందించింది. సిస్టమ్ అప్‌గ్రేడ్ పనుల కారణంగా రేపు (శనివారం) తెల్లవారుజామున బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుందని వెల్లడించింది.

ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

Read Also: Tamil Nadu Elections 2026: విజయ్ రాకపోయినా విగ్రహంతో నామినేషన్

 Banking services will be closed tomorrow morning!

సేవల నిలిపివేత సమయం

బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం, రేపు తెల్లవారుజామున 2:30 AM నుండి 6:30 AM వరకు అంటే సుమారు 4 గంటల పాటు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. సిస్టమ్ పనితీరును మెరుగుపరచడంలో భాగంగా ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియను చేపడుతున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.

HDFC Banking Services Down: అందుబాటులో ఉండే సేవలు ఇవే

బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయినప్పటికీ, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని వెసులుబాట్లను బ్యాంక్ కల్పించింది: ఉదయం 5 గంటల తర్వాత యూపీఐ (UPI) లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చు. అప్‌గ్రేడ్ సమయంలోనూ డెబిట్ కార్డుల ద్వారా రూ. 5,000 వరకు నగదు విత్‌డ్రాయల్స్ మరియు ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉంది. హెచ్‌డిఎఫ్‌సి కి చెందిన ‘Zapp’ వాలెట్ సేవలు మాత్రం ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా కొనసాగుతాయని బ్యాంక్ వెల్లడించింది. అత్యవసర లావాదేవీలు ఉన్నవారు ఈ సమయాలను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని బ్యాంక్ కోరింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పీఎఫ్ యూజర్లకు షాక్.. ఆ ఒక్క డేట్ తప్పుంటే డబ్బులు రావు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha