Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైనర్ బాలికను గర్భవతిని చేసిన వివాహితుడు.. నిందితుడు అరెస్ట్

మైనర్ బాలికను గర్భవతిని చేసిన వివాహితుడు.. నిందితుడు అరెస్ట్

వార్త 2 weeks ago

Tirupati crime: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయి భార్య ఉన్న ఒక యువకుడు, ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ దారుణం కారణంగా సదరు బాలిక గర్భవతి కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Read Also : Karnataka Ex Army Murder :రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం మాజీ సైనికుడిని చంపిన భార్య!

 Married man impregnates minor girl; accused arrested.

Tirupati crime: భార్య ఉండగానే మైనర్ బాలికకు వల.. ప్రేమ పేరుతో మోసం

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు గోపీచంద్‌కు రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. ఇంట్లో భార్య ఉన్నప్పటికీ, అతడి బుద్ధి మారలేదు. స్థానికంగా ఉండే ఒక మైనర్ బాలికపై కన్ను వేసిన గోపీచంద్, ఆమెను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, బాలికను ట్రాప్ చేసి పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కొంతకాలంగా సదరు మైనర్ బాలిక శారీరక మార్పులకు గురైంది. ఇటీవల ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో, ఏం జరిగిందో తెలియని తల్లిదండ్రులు ఆందోళనతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భవతి అని నిర్ధారించడంతో తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత బాలికను నమ్మించి మోసం చేసిన గోపీచంద్ దారుణం బయటపడింది.

పోక్సో కేసు నమోదు.. నిందితుడు గోపీచంద్ రిమాండ్‌కు

తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నెంబర్ 207/2026 కింద నిందితుడు గోపీచంద్‌పై పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నాగ్‌పూర్‌లో ఘోరం.. ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha