Amalapuram Minor Abortion: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్ (Minor Abortion) వ్యవహారంపై జిల్లా యంత్రాంగం నిశిత విచారణ ప్రారంభించింది.
జిల్లా కలెక్టర్ జారీ చేసిన కఠిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఉన్నతాధికారుల ప్రత్యేక బృందం మంగళవారం స్థానిక 'ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్' (Women's Care & General Hospital) లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read also: Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి !
ఈ ఉన్నత స్థాయి విచారణ బృందంలో అమలాపురం ఆర్డీవో మమ్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) దుర్గారావు, డీసీహెచ్‌ఎస్ (DCHS) కోఆర్డినేటర్ డాక్టర్ కార్తీక్, చైల్డ్ అండ్ ఉమెన్ కేర్ కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగ మానస, ఐసీడీఎస్ (ICDS) పీడీ, అదనపు డీఎంహెచ్‌వో భారతి లక్ష్మి పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు డాక్టర్ లంకె శిరీషను ప్రత్యేక బృందం గంటల పాటు నిలదీసి, కేసుకు సంబంధించిన పలు కీలక వివరాలను సేకరించింది. మైనర్ అబార్షన్ల విషయంలో పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలు, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్ట ఉల్లంఘనలు, హాస్పిటల్ రికార్డులు మరియు వైద్య విధానాల నిర్వహణపై అధికారులు కూలంకషంగా ఆరా తీశారు.
మైనర్ బాలిక గర్భస్రావం(Amalapuram Minor Abortion) వ్యవహారంలో ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్యుల పాత్రపై పూర్తి స్థాయి విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సేకరించిన డాక్యుమెంట్లు, ఆసుపత్రి రికార్డుల ఆధారంగా ఒక సమగ్ర నివేదికను రూపొందించి బుధవారం జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు విచారణ బృందం స్పష్టం చేసింది. ఈ అధికారిక నివేదిక ఆధారంగా సదరు ఆసుపత్రిపై మరియు నిబంధనలు ఉల్లంఘించిన వైద్యురాలిపై చట్టపరంగా ఎలాంటి తదుపరి కఠిన చర్యలు తీసుకోవాలో కలెక్టర్ నిర్ణయించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

