Dailyhunt
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్: క్యూలైన్లలో వర్చువల్ రియాలిటీ

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్: క్యూలైన్లలో వర్చువల్ రియాలిటీ

వార్త 3 weeks ago

TTD: ఏడుకొండల స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు రద్దీ సమయాల్లో 18 నుండి 24 గంటల పాటు క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ సమయంలో భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేందుకు టీటీడీ 'వర్చువల్ రియాలిటీ' (VR) టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు వీఆర్ హెడ్‌సెట్ల ద్వారా తిరుమల క్షేత్ర విశేషాలను, శ్రీవారి నిత్య కల్యాణ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

Read Also:Bandaru Sravani: శివాలయంను దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

 TTD’s Master Plan to Beat Boredom in Queues: A Spiritual Journey Through Virtual Reality

TTD: వీఆర్ హెడ్‌సెట్లతో సరికొత్త అనుభూతి.. టీవీల స్థానంలో అత్యాధునిక సాంకేతికత

ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్‌లలోని కంపార్ట్‌మెంట్లలో భక్తుల కోసం టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ, రద్దీ మరియు కోలాహలం కారణంగా వాటి శబ్దం సరిగ్గా వినపడటం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా వీఆర్ టెక్నాలజీని టీటీడీ ఎంచుకుంది. ఈ పరికరాల ద్వారా భక్తులు ఏకాంతంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మిక దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ప్రాజెక్టును విరాళాల (Donation Basis) రూపంలో చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం నాణ్యమైన వీఆర్ పరికరాల ఎంపికపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే భక్తులకు నిరీక్షణ సమయం కూడా ఒక మధుర జ్ఞాపకంలా మారుతుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బాసరలో రేవంత్ మనవడికి అక్షరాభ్యాసం.. ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha