Dailyhunt
మమతా బెనర్జీకి భవానీపూర్‌లోనూ షాక్ తప్పదు.. మోదీ

మమతా బెనర్జీకి భవానీపూర్‌లోనూ షాక్ తప్పదు.. మోదీ

వార్త 1 week ago

West Bengal Election 2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హల్దియాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బెంగాల్‌లో మార్పు గాలి వీస్తోందని, ఈసారి బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also:artificial intelligence: కృత్రిమ మేథ ప్రజాశ్రేయస్సు కేనా?

West Bengal Election 2026: మమతా బెనర్జీపై విమర్శలు

ఐదేళ్ల క్రితం నందిగ్రామ్‌లో ఎదురైన ఫలితమే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పునరావృతమవుతుందని మోదీ అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ (Bhawanipur) నియోజకవర్గంలో కూడా ఆమెకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధి విషయంలో అడ్డుపడుతోందని విమర్శించారు. ప్రైవేటు రంగాల్లో సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మోసాలు ప్రజల ముందు ఉంచుతామని మోదీ పేర్కొన్నారు.

 PM Modi Haldia rally speech

బెంగాల్ యువతను తృణమూల్ కాంగ్రెస్ ఎంతో మోసం చేసిందని, ఆ పాపాలు ఊరికే పోవని హెచ్చరించారు. బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రాగానే కేంద్ర పథకాలు ఇక్కడ అమల్లోకి వస్తాయని హామీ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్యాయాలు, కుంభకోణాలపై విచారణ జరిపి, కారకులైన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. శరణార్థులకు ఆశ్రయమిస్తామని, కానీ చొరబాటుదారులను తరిమికొడతామని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఫోన్ పాస్‌వర్డ్ చిచ్చు: ముగ్గురు కుమార్తెల కళ్లెదుటే భార్య దారుణ హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha