Big Shock to Mamata: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా ఊహించని విధంగా మరో భారీ ఎదురుదెబ్బ తగలనుంది.
ఇప్పటికే అసెంబ్లీ పరిధిలో 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత రితబ్రత బెనర్జీకి బహిరంగంగా మద్దతు ప్రకటించి సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఆ తిరుగుబాటు సెగ కాస్తా పార్లమెంట్ సభ్యుల (MPs)కు కూడా పాకినట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీలలో నిలువునా చీలిక వస్తున్నట్లు నమ్మదగిన సమాచారం. తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న 29 మంది లోక్‌సభ ఎంపీలలో ఏకంగా 20 మంది, అలాగే 13 మంది రాజ్యసభ సభ్యులలో 9 మంది మమతా బెనర్జీ పక్షాన్ని వీడటానికి సిద్ధమయ్యారనే వార్తలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Read Also : తిరుమల కల్తీ నెయ్యి కేసు: ఈడీ యాక్షన్.. 6 రాష్ట్రాల్లో సోదాలు!
Big Shock to Mamata
Big Shock to Mamata: 'దిల్లీ' ఫార్ములాతో తిరుగుబాటు
పార్టీని వీడేందుకు సిద్ధమైన ఈ రెబెల్ ఎంపీలు అధిష్టానానికి షాక్ ఇచ్చేలా దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత రాఘవ్ చడ్డా గతంలో అనుసరించిన వ్యూహాత్మక ఫార్ములా తరహాలో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తమతో ఉన్న భారీ సంఖ్యాబలాన్ని చూపిస్తూ.. తాము పంపే వర్గమే 'అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షం' అని క్లెయిమ్ చేయడానికి ఈ తిరుగుబాటు ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే వీరంతా లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి అధికారికంగా వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం గనుక నిజమైతే బెంగాల్ అధికార పీఠంతో పాటు జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ రాజకీయ ప్రాభవం మరియు పట్టు పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

