Damodar Rajanarsimha: అందోల్ నియోజకవర్గంలో శనివారం మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజానర్సింహ పర్యటనకు అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11:00 గంటలకు శివంపేట్ మండలం హున్నాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.43 లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన వర్క్ షాప్ షెడ్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం 11:30 గంటలకు అందోల్‌లో రూ.1.80 లక్షల నిధులతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.
Read Also: Sangareddy RTA and Revenue: ఎస్సార్ మ్యాపింగ్‌పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

Damodar Rajanarsimha: హెల్ప్ డెస్క్ ప్రారంభం
ఉదయం 11:45 గంటలకు అందోల్ చెరువు వద్ద రూ.5 కోట్ల నిధులతో నిర్మించనున్న టూరిజం రెస్టారెంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు జోగిపేట్‌లో రూ.20 కోట్ల నిధులతో నిర్మించనున్న సమగ్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు జోగిపేట్‌లో రూ.53 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ మొదటి అంతస్తు భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జోగిపేట్ కాంగ్రెస్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

