Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ తండ్రి ఆత్మహత్యాయత్నం!

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ తండ్రి ఆత్మహత్యాయత్నం!

వార్త 3 weeks ago

Konda Surekha: తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పూర్వ ఓఎస్‌డీ (OSD) సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

ఉదయం ఎంతకీ నిద్రలేవకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయనను గమనించగా నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేటు వాహనంలో వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో (ICU) చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also :Lalaguda Couple Suicide: క్షణిక ఆవేశంలో తీవ్ర నిర్ణయం.. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Konda Surekha: పోలీసుల విచారణ

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి మరియు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణాలు, కుటుంబంలో లేదా ఇతరత్రా ఏవైనా మానసిక ఒత్తిళ్లు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. మాజీ ఓఎస్‌డీ కుటుంబంలో ఈ ఘటన జరగడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.పరిస్థితి విషమంగా ఉంది.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన డీసీఎం.. 200 మేకలు సజీవ దహనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha