CSK vs DC live score: ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరుగుతున్న మ్యాచులో బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
Read Also:SRH vs PBKS live Score: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు 220 పరుగుల భారీ లక్ష్యం
CSK vs DC live score: సంజు శాంసన్ వీరవిహారం
ఈ మ్యాచ్‌లో సంజూ విధ్వంసక సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు సాధించి చెన్నై భారీ స్కోరుకు బాటలు వేశాడు. కాగా, ఐపీఎల్ లో సంజూ శాంసన్ కు ఇది నాలుగో సెంచరీ. ఈ సీజన్ లో మొదటిది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, అతని నిర్ణయం సరైంది కాదని చెన్నై బ్యాటర్లు నిరూపించారు.
CSK vs DC Highlights
ఇన్నింగ్స్ ఆరంభంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (18 బంతుల్లో 15) నెమ్మదిగా ఆడి 62 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రేతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా శాంసన్ బౌండరీలతో విరుచుకుపడగా, మాత్రే అతనికి చక్కటి సహకారం అందించాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

