పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్
Mahesh Kumar Goud: పొంగులేటి పై విమర్శలు కాదు ఆధారాలు ఉంటే గాంధీభవన్ కు వచ్చి ఇవ్వండని అంటూ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు.
గాంధీభవన్లో గురువారం ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడుతూ మా మీద బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బిఆర్ఎస్ దోపిడీ గురించి ప్రజలకు అర్థమైంది ఆధారాలు తీసుకొని చర్చకు రండి నేను చర్చ సిద్ధమని మనరుద్ఘాటించారు. మంత్రు లపై పసలేని ఆరోపణలు చేయొద్దని ఆయన హరీష్ రావుకు హితవు చెప్పారు. మంత్రి పొంగులేటి పై వచ్చిన ఆరోపణలపై ప్రూఫ్ ఉంటే ఆలోచిస్తుందనీ నాదర్గుల్ భూముల కుంభకోణం బిఆర్ఎస్ హయంలో జరిగిందనీ అన్నారు.
Read Also : Medak District Yoga Program: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
Provide evidence for the allegations against Minister Ponguleti: Mahesh Kumar Goud
Mahesh Kumar Goud: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు బిజెపి, బిఆర్ఎస్ రేపైనా కలుస్తాయి!
అప్పుడు కాంగ్రెస్ మేము కట్టిన ప్రాజెక్టుల కు ఇప్పటిదాకా ఎక్కడ గీత కూడా పడలేదు మీరు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోతుందనీ ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి ఫామ్ ఇచ్చామనీ, పరిస్తితులను బట్టి ముందుకి వెళ్ళాలనీ జీవన్ రెడ్డి విమర్శలు ప్రజలు పట్టించుకునే పరిస్తితిలో లేరనీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరు? అని నిలదీశారు. కాంగ్రెస్ కు విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బిఆర్ఎస్ పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ బిజెపి వేర్వేరు కాదని భాష్యం చెప్పారు. బిజెపి, బిఆర్ఎస్ రేపైన కలుస్తాయనీ జోస్యం చెప్పారు. బిజెపితో అంటకాగినవారు దేశంలో ఎవరు బాగుపడుద్ది లేదని, ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి బిఆర్ఎస్ పోయింది అని అన్నారు. మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశం నాకున్న సమాచారం ప్రకారం మంత్రి వర్గ విస్తరణలో ఇప్పట్లో ఉండదనీ ఆయన తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కరీంనగర్ పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. మరణించిన వారికి జీతాలు!

