Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు..

మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు..

వార్త 2 months ago

TG Inter Results 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాల ప్రక్రియ పూర్తయింది.

ఈ ఏడాది కేవలం 25 రోజుల వ్యవధిలోనే బోర్డు అధికారులు మూల్యాంకనాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. దాదాపు పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో మొదటి మరియు రెండో సంవత్సరం విద్యార్థుల మార్కుల వివరాలను ఒకేసారి వెల్లడించనున్నారు. ఏప్రిల్ 8 నాటికే అన్ని సాంకేతిక పనులు ముగించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Read also: CBSE టెన్త్ ఫలితాల అప్డేట్

TS Inter Results 2026 Marks Checklist

TG Inter Results 2026: వాట్సాప్‌లో ఫలితాలు.. నయా టెక్నాలజీతో సులభంగా

ఈ విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల కోసం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్లు సర్వర్ డౌన్ సమస్యలతో మొరాయించినా.. విద్యార్థులు తమ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారా సులభంగా ఫలితాలను పొందవచ్చు. ఇందుకోసం 8096958096 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపి, అక్కడ కనిపించే ఆప్షన్లలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. క్షణాల్లో మీ మార్కుల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఫలితాలు చూసుకోవడం ఎంతో సులభతరం కానుంది.

ఫెయిల్ అయినా బెంగ వద్దు.. మే నెలలోనే సప్లిమెంటరీ

పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించలేని విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. ఫలితాలు విడుదలైన వెంటనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించనున్నారు. ఈ పరీక్షలను మే నెలలోనే నిర్వహించి, జూన్ కల్లా ఫలితాలు ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు తమ పైచదువుల కోసం ఒక ఏడాది వృథా కాకుండా జాగ్రత్త పడవచ్చు. మార్కులు తక్కువ వచ్చాయని నిరాశ చెందకుండా, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసేందుకు కూడా బోర్డు అవకాశం కల్పిస్తోంది. కాబట్టి విద్యార్థులు ధైర్యంగా ఉండి తదుపరి లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు..ఎలాగంటే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha