RR vs PBKS: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తమ విజయయాత్రను కొనసాగిస్తోంది. మంగళవారం ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, పంజాబ్‌కు ఈ సీజన్‌లో మొదటి ఓటమిని రుచి చూపించింది.
ఈ విజయంలో దక్షిణాఫ్రికా వీరుడు డోనోవన్ ఫెరీరా (Donovan Ferreira) హీరోగా నిలిచాడు.
Read Also:Sri Lanka Cricket Board Crisis: శ్రీలంక క్రికెట్‌పై మళ్లీ ఐసీసీ వేటు పడనుందా?
ముల్లాన్‌పూర్‌లో ఫెరీరా విధ్వంసం
షిమ్రాన్ హెట్‌మయర్ అందుబాటులో లేని సమయంలో వచ్చిన అవకాశాన్ని డోనోవన్ ఫెరీరా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు.కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.అర్ష్‌దీప్ సింగ్, లోకీ ఫెర్గూసన్ వంటి స్టార్ పేసర్ల బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్‌ను గెలిపించాడు.
RR vs PBKS: సల్మాన్ ఖాన్‌కు 'సారీ'.. ఎందుకంటే?
మ్యాచ్ విజయం తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఫెరీరా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు క్షమాపణలు చెబుతూ కనిపించాడు.2014లో పంజాబ్ కింగ్స్ (ప్రీతి జింటా టీమ్) మ్యాచ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ “Zinta’s team won kya?” (జింటా టీమ్ గెలిచిందా?) అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్ సమయంలోనూ వైరల్ అవుతుంటుంది.ఆ పాత ట్వీట్‌ను ఉద్దేశించి ఫెరీరా నవ్వుతూ.. “Sorry bhai, aaj nahi“ (సారీ భాయ్, ఈరోజు పంజాబ్ గెలవలేదు) అని సమాధానమిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
కాంబ్లీ కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారా? కొత్త యాడ్‌పై నెటిజన్ల ఫైర్

