Ponnam Prabhakar: హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 14 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Read Also : HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో భారీ ఊరట!
Only clay Vinayaka idols should be used: Minister Ponnam Prabhakar.
Ponnam Prabhakar: మట్టి వినాయక విగ్రహాల ప్రోత్సాహం & మొక్కల పంపిణీ
పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్న మంత్రి, అధికారులకు, మండపాల నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలకు బదులుగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల వాడకాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. మండప నిర్వాహకులు, భక్తులు ప్లాస్టిక్ లేదా ఇతర కృత్రిమ వస్త్రాలకు బదులుగా చేనేత కండువాలను వినియోగించాలని కోరారు.
కోర్టు నిబంధనల పాటింపు & వర్షాల కోసం ప్రత్యేక పూజలు
రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండేలా, జలాశయాలు నిండేలా మంచి వర్షాలు కురవాలని వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. అంతేకాకుండా, శాంతిభద్రతల పరిరక్షణ, నిమజ్జనం విషయంలో గౌరవ కోర్టు విధించిన నిబంధనలను పూర్తిస్థాయిలో గౌరవిస్తూ, ప్రజలందరూ స్వచ్ఛందంగా, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

