Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 15 నుంచి శుభకార్యాలకు విరామం

మే 15 నుంచి శుభకార్యాలకు విరామం

వార్త 3 months ago

Pelli Muhurthalu 2026: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడికి తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. మే 15 తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతోంది.

దీనినే పండితులు మూఢమి కాలంగా పిలుస్తారు. ఈ సమయంలో వివాహాలు లేదా గృహప్రవేశాలు చేయడం శాస్త్రం ప్రకారం మంచిది కాదు. అందుకే దాదాపు 36 రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించవద్దని సిద్ధాంతం చెబుతోంది.

Read also: Chicken rates today: ఆకాశానికి చికెన్ ధరలు.. జూన్ వరకు ఇంతేనా? కారణాలివే!

 Telugu Wedding Season Break 2026 News

Pelli Muhurthalu 2026: జూన్ 19 నుంచి మళ్ళీ కొత్త ముహూర్తాలు

మే 15 నుంచి మొదలయ్యే ఈ విరామం జూన్ 18 వరకు కొనసాగుతుంది. మళ్ళీ జూన్ 19 నుంచి శుభ ముహూర్తాలు అందుబాటులోకి వస్తాయి. అప్పటి వరకు కొత్త పనులు ప్రారంభించడానికి సావకాశం ఉండదు. ముహూర్తాలు లేని ఈ సమయంలో చాలా మంది తమ వేడుకలను వాయిదా వేసుకున్నారు. జూన్ మూడో వారం నుంచి మళ్ళీ ఫంక్షన్ హాళ్లు సందడిగా మారుతాయి.

వ్యాపార రంగాలపై మూఢమి సెగ

శుభకార్యాలు నిలిచిపోవడంతో మార్కెట్‌లో వ్యాపారాలు మందగించే అవకాశం ఉంది. ప్రధానంగా బంగారం షాపులు, బట్టల వ్యాపారాలు, క్యాటరింగ్ రంగాలకు గిరాకీ తగ్గుతుంది. ఫొటోగ్రఫీ, డెకరేషన్, ట్రావెల్స్ వంటి రంగాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. పెళ్లిళ్లు లేకపోవడంతో ఈ 36 రోజులు వ్యాపార వర్గాలు కాస్త ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha