Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే నెలలో ఏకంగా 9 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడో తెలుసా?

మే నెలలో ఏకంగా 9 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడో తెలుసా?

వార్త 1 month ago

Bank Holidays May 2026: మే నెలలో పనులు ఉన్నవారు అలర్ట్ అవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన జాబితా ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో మొత్తం 9 రోజులు బ్యాంకులు పని చేయవు.

ఇందులో మే డే వంటి పండుగలతో పాటు సాధారణంగా వచ్చే శని, ఆదివారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ ఆర్థిక లావాదేవీలను ఇబ్బంది కలగకుండా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.

Read also: Software Engineer suicide: ముగ్గురితో ఎఫైర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు.. టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు!

 May 2026 Bank Holiday Calendar List

Bank Holidays May 2026: ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో

బ్యాంకులు ప్రత్యక్షంగా మూసివేసినప్పటికీ, డిజిటల్ పద్ధతిలో సేవలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలతో పాటు నెట్ బ్యాంకింగ్ కూడా పని చేస్తుంది. ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. నగదు జమ చేయడం లేదా పెద్ద మొత్తంలో డ్రా చేయడం వంటి పనుల కోసం ముందే బ్యాంక్ టైమింగ్స్ చూసుకోవడం మంచిది.

సెలవుల పూర్తి జాబితా ఇలా ఉంది

మే 1వ తేదీన కార్మికుల దినోత్సవం సందర్భంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. దీనికి తోడు రెండో శనివారం, నాలుగో శనివారం అలాగే ఆదివారాలు కలుపుకుని మొత్తం తొమ్మిది రోజులు సెలవులు వస్తాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పండుగలను బట్టి 13 రోజుల వరకు సెలవులు ఉన్నా, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 9 రోజులు బ్యాంకులు పని చేయవు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఉచిత ప్రయాణం.. ఫ్రీ జర్నీ ఎప్పట్నుంచంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha