Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

వార్త 3 days ago

Medak Fire Accident: భారీ అగ్ని ప్రమాదం గురైన కంటైనర్ లో నూతన సిఎన్జి కార్లు దగ్ధమైన భయాందోళన కలిగించే సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది సిఎన్జి కార్లతో తరలి వెళ్తున్న కంటైనర్ లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో అగ్ని శకలాలు హైవేపై ఎగిసిపడడంతో వాహనదారులు తీవ్రభయంతులకు గురి అయ్యారు

Read also: Kaleshwaram Saraswathi Pushkaralu 2026: కాళేశ్వరంలో వైభవంగా ప్రారంభమైన పుష్కరాలు

Medak Fire Accident: బూడిదైన ఎనిమిది కొత్త సీఎన్జీ కార్లు

తూప్రాన్ బైపాస్ వద్ద వెళ్తున్న కంటైనర్ వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు ఒకేసారి వ్యాపించడంతో కంటైనర్ లోని సీఎన్జీ కారులు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ అగ్ని ప్రమాదంలో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మే 25 నుండి తెలంగాణలో మహిళా వారోత్సవాలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha